రాజమౌళి సినిమా నా కెరీర్ కు మైనస్ అయింది.. నాగినీడు సంచలన వ్యాఖ్యలు?

మర్యాదరామన్న సినిమాతో నాగినీడు ఓవర్ నైట్ లో పాపులారిటీని సంపాదించుకున్నారనే సంగతి తెలిసిందే.

ఆ సినిమాకు ముందే నాగినీడు పలు సినిమాల్లో నటించినా మర్యాదరామన్న సినిమాలో నటనతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.

మర్యాదరామన్న సినిమా తర్వాత నాగినీడుకు సినిమా ఆఫర్లు భారీగా పెరిగాయి.తాజాగా నాగినీడు అలీతో సరదాగా షోకు గెస్ట్ గా హాజరయ్యారు.

ప్రోమోలో నాగినీడు అలీ డైలాగ్స్ ను చెప్పి నవ్వించారు.తాను రెండుసార్లు చనిపోయి మళ్లీ పుట్టానని నాగినీడు అన్నారు.

నా జీవితం ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్ కు అంకితమైందని నా ఏజ్ 30 అని దానిని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చంటూ నాగినీడు పేర్కొన్నారు.ఎంతమంది పిల్లలు అని అలీ అడగగా తనకు రెండు మైనస్ లు అని నాగినీడు చెబుతారు.

Advertisement

ఇద్దరు ఆడపిల్లలా అని అడగగా ఇద్దరు మగపిల్లలు అని నాగినీడు చెబుతారు.ఏఎన్నార్ పూలరంగడు సినిమా చూసి సినిమాల్లోకి రావాలని అనుకున్నానని చిన్నప్పుడు రాజబాబులా ఇమిటేట్ చేసేవాడినని ఇప్పుడు ఇమిటేట్ చేస్తే బాగుండదని నాగినీడు తెలిపారు.

మర్యాదరామన్న తనను పైన కూర్చోబెట్టిందని అది మైనస్ అయిందని నాగినీడు వెల్లడించారు.మర్యాదరామన్న తర్వాత ఏదైనా క్యారెక్టర్ ఇస్తే మీరు చేయగలిగే క్యారెక్టర్ ఇస్తాం కానీ సాధారణ క్యారెక్టర్ ఇవ్వలేం కదా అని అన్నారని నాగినీడు అన్నారు.

మనస్సులో తాను డబ్బులు వస్తే చాలని ఏ పాత్ర అయితే ఏంటని అనుకున్ననని నాగినీడు తెలిపారు.స్టైల్ కోసమే తాను తాయత్తులు కట్టుకున్నానని నాగినీడు వెల్లడించారు.గర్వం, అహంభావం, అహంకారంను పాజిటివ్ గా కూడా వాడవచ్చని నాగినీడు వెల్లడించారు.

ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కోసం ఐదు ఎకరాల స్థలం డొనేట్ చేసి ఈ ఆస్పత్రి ద్వారా కంటిచూపు సరిచేయించుకుని సినిమా చూస్తే మనకే లాభం కదా అని అన్నారని నాగినీడు చెప్పుకొచ్చారు.

సంతానం లేక ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఒక్కసారి ఆలయానికి వెళితే చాలు..!
Advertisement

తాజా వార్తలు