ఆ కంటెస్టెంట్ కు మద్దతు ప్రకటించిన నాగబాబు.. చివరివరకు అంటూ?

బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోలలో బిగ్ బాస్ షో ఒకటనే సంగతి తెలిసిందే.

ఆదివారం రోజున బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం కాగా సోషల్ మీడియాలో ఇప్పటికే పలువురు సెలబ్రిటీల పేర్లతో ఆర్మీలు మొదలయ్యాయి.

గత సీజన్ లో ఎక్కువమంది సెలబ్రిటీలు అభిజిత్ కు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.బిగ్ బాస్ హౌస్ లో మొదట మిత్రులుగా ఉన్నవాళ్లే తర్వాత రోజుల్లో శత్రువులయ్యే అవకాశం ఉంటుంది.

ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో గొడవలు మొదలు కావడంతో రాబోయే రోజుల్లో గొడవలు ఊహించని స్థాయిలో జరిగే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.సోషల్ మీడియాలో సైతం ఆయా కంటెస్టెంట్ల అభిమానులు తమ ఫేవరెట్ కంటెస్టెంట్ పై విమర్శలు చేసిన వారిపై గొడవలకు దిగుతుండటం గమనార్హం.

ప్రముఖ సినీ నటులలో ఒకరైన నాగబాబు ప్రియాంక సింగ్ కు తన మద్దతు ప్రకటించారు.బిగ్ బాస్ హౌస్ లో రవి, ప్రియ, సింగర్ శ్రీరామ్ చంద్ర, నటరాజ్ మాస్టర్ పాల్గొన్నారని అయితే వీళ్లంతా ఒకెత్తు అయితే ప్రియాంక సింగ్ మాత్రం మరో ఎత్తు అని నాగబాబు చెప్పుకొచ్చారు.

Actor Nagababu Support Bigg Boss Contestant Priyanka Singh, Bigg Boss Contestant
Advertisement
Actor Nagababu Support Bigg Boss Contestant Priyanka Singh, Bigg Boss Contestant

ప్రియాంక ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిందని నాగబాబు వెల్లడించారు.బిగ్ బాస్ హౌస్ లో ప్రియాంక ఉందనే విషయం తనకు చాలా సంతోషం కలిగించిందని నాగబాబు కామెంట్లు చేశారు.

Actor Nagababu Support Bigg Boss Contestant Priyanka Singh, Bigg Boss Contestant

ట్రాన్స్ జెండర్ గా మారిన తర్వాత ప్రియాంక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొందని నాగబాబు చెప్పుకొచ్చారు.ప్రియాంకకు ఛాన్సులు రాని సమయంలో ఒక షోకు సంబంధించి తాను సాయం చేశానని నాగబాబు ప్రకటించారు.ప్రియాంక విన్నర్ అయినా కాకపోయినా తన మద్దతు మాత్రం ప్రియాంకకే అని నాగబాబు వెల్లడించారు.

నాగబాబు మద్దతు ఇవ్వడం ప్రియాంకకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు