Hero Abbas : విశాల్ నిజస్వరూపం బయటపెట్టిన అబ్బాస్.. ఇతరులకు అలా చెప్పేవాడంటూ?

ఒకప్పటి హీరో అబ్బాస్ గురించి మనందరికీ తెలిసిందే.

గత కొద్ది రోజులుగా హీరో అబ్బాస్( Hero Abbas ) పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం తెలిసిందే.

మొన్నటి వరకు సినిమా ఇండస్ట్రీకి సోషల్ మీడియాకు పూర్తి దూరంగా ఉన్న అబ్బాస్ ప్రస్తుతం వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ గతంలో జరిగిన విషయాలను తన కెరీర్ లో ఎదుర్కొన్న అనుభవాల గురించి పంచుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే ఇంటర్వ్యూలలో అబ్బాస్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అబ్బాస్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ప్రేమ దేశం.

ఈ సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకున్నారు అబ్బాస్.ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఆ తరువాత 2015లో ఇండస్ట్రీకి దూరమయ్యారు.

Advertisement

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా న్యూజిలాండ్‌లో( New Zealand ) స్థిరపడ్డారు.కొన్ని రోజుల క్రితం స్వదేశానికి తిరిగొచ్చిన అబ్బాస్‌ కోలీవుడ్‌( Kollywood ) మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

వాటిల్లోని ఒక చిట్‌చాట్‌లో పలువురు తమిళ హీరోలపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు.సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ సీసీఎల్‌ విషయంలో నటుడు విశాల్‌ తో విభేదాలు వచ్చినట్టు తెలిపారు.

ఈ సందర్భంగా అబ్బాస్ మాట్లాడుతూ.చిత్ర పరిశ్రమకు చెందిన వారందరితో మంచి బంధాన్ని పెంపొందించుకోవానేదే నా లక్ష్యం.

నటుల మధ్య సోదరభావం ఉండాలనే ఉద్దేశంతో సీసీఎల్‌ ని ప్రారంభించారు.ఆ లీగ్‌ సెకండ్‌ సీజన్‌లో విశాల్‌తో మనస్పర్థలు తలెత్తాయి.అతడు నా గురించి ఇతరులకు అబద్ధాలు చెప్పేవాడు.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

నాకు మర్యాద దక్కని చోటు ఉండడం ఇష్టం లేక ఆటను వదిలేయాలని నిర్ణయించుకున్నాను.విశాల్‌ అన్న మాటలకు అప్పుడు ఎంతో బాధపడ్డాను.

Advertisement

అతడు ఏదో ఒక రోజు జరిగిన విషయాన్ని అర్థం చేసుకుని, రియలైజ్‌ అవుతాడని అనుకున్నాను.ఏదేమైనా విశాల్‌ ఇప్పటికీ ఫ్యామిలీలో ఒక భాగం.

ఏ కుటుంబంలో నైనా మనస్పర్థలు రావడం సహజం.అతడిని నేనెప్పుడో క్షమించాను.

అతడు నాకు ఎదురైతే హాయ్‌ అంటూ పలకరిస్తాను కానీ, మునుపటిలా సన్నిహితంగా ఉండలేను అంటూ గతంలో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు అబ్బాస్.

తాజా వార్తలు