అసంతృప్తిలో అసలైన ఉద్యమకారులు...టీఆర్ఎస్ కు ముప్పు పొంచి ఉందా?

తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణ దగాకు గురయిందనే ఆవేదనతో మొదలైందన్న విషయం తెలిసిందే.

అయితే తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం మొట్ట మొదటి ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ఏర్పాటు చేయడం, రెండో సారి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్న విషయం మనకు తెలిసిందే.

అయితే టీఆర్ఎస్ పార్టీ ఫక్తు రాజకీయ పార్టీగా మారక ముందు ఉద్యమ పార్టీగా ఉందన్న విషయం తెలిసిందే.అయితే టీఆర్ఎస్ పార్టీ  తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం చేపట్టిన సమయంలో ఎంతో మంది ఉద్యమకారులు టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండి, ఉద్యమ లక్ష్యం నీరుగారకుండా ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించడంలో ఉద్యమ కారుల పాత్ర కీలకమైనది.

అయితే తెలంగాణ ఏర్పాటు అయ్యాక ఉద్యమ కారులు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీపై ఆశలు పెట్టుకున్నారు.అయితే కొంత మందికే న్యాయం జరిగిందని, అసలైన ఉద్యమకారులకు న్యాయం జరగలేదని చాలా సార్లు ఉద్యమకారులు బహిరంగంగానే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

అయితే ప్రభుత్వం కూడా సాధ్యమైనంత వారికి అవకాశం కల్పించామని, అందరికీ ఆశించినంత న్యాయం కొన్ని సార్లు జరగకపోవచ్చని టీఆర్ఎస్ నాయకులే స్వయంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి.అయితే టీఆర్ఎస్ ఉద్యమ కారుల స్పష్టమైన అభిప్రాయం ఏంటని ఒకసారి గమనిస్తే ఉద్యమ కారులకు అందరికీ ఒక్కసారి సరైన న్యాయం చేయలేమని టీఆర్ఎస్ చెబుతున్న ఈ వాదనని ఒకసారి అంగీకరిస్తే మరి ఉద్యమ ద్రోహులకు ఎలా స్థానం కల్పిస్తున్నారో తెలియజేయాలని, ఉద్యమ ద్రోహులని అందలం ఎక్కిస్తూ వారి ఆధ్వర్యంలో ఉద్యమకారులు పనిచేస్తుండటం అవమానంగా భావిస్తున్నామని న్యాయం జరగక దగాకు గురైన ఉద్యమకారులు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

అయితే ఉద్యమ కారులు పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా సాధించుకున్నారో, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో, అదే పోరాట పటిమతో పనిచేసి తమకు అన్యాయం చేసిన పార్టీకి తగిన శాస్తి జరుగుతుందని హెచ్చరిస్తున్నారు.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు