అఫీషియల్: ధర్మస్థలి తలుపులు తెరుచుకునేది అప్పుడే!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో చిరంజీవి వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు, ఆయన పర్ఫార్మెన్స్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది.కాగా ఎండోమెంట్ ఆఫీసర్ పాత్రలో మెగాస్టార్ ఈ సినిమాలో మనకు కనిపిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనే అంశానికి నిన్న చిత్ర యూనిట్ ఓ నిర్ణయానికి వచ్చిన సంగతి తెలిసిందే.కాగా తాజాగా ఆచార్య చిత్ర టీజర్‌ను జనవరి 29న సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా తెలిపింది.ధర్మశాల తలుపులు తెరుచుకునేది అప్పుడే అంటూ ఆచార్య చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఈ సినిమా కోసం ఆచార్య చిత్ర యూనిట్ చాలా తీవ్రంగా కష్టపడుతుందని, ఈ సినిమాలో ప్రేక్షకులకు తమ కష్టం కనిపిస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది.ఇక ఈ చిత్ర టీజర్ రిలీజ్ విషయంపై నిన్న చిరంజీవి చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

Advertisement

కాగా ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కేమియో పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు సిద్ధ అని చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది.

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మనకు కనిపిస్తుండగా ఆయన సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు