ఎల్లారెడ్డి పేట లో ప్రమాదవశాత్తు గడ్డి వాముల దగ్దం

త్రుటిలో ప్రాణాలతో బయటపడిన ఆవు దూడ.

ఫైర్ ఇంజన్ కు సమాచారం అందించిన మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్( Balaraju Yadav )రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మేజర్ గ్రామపంాయతీ పరిధిలో గల కిషన్ దాస్ పేట లో భక్తి సంఘం వద్ద పలువురు రైతులకు చెందిన గడ్డి వాములు ప్రమాదవశాత్తు దగ్ధమయ్యాయి.

భక్తి సంఘం వద్ద బింగి మల్లేశం, గడ్డమీది నరేష్ లు వరి పంట కోయించి గడ్డివాము పెట్టారు.ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అటు వైపు వెళ్తూ నిప్పటించారని దీంతో ఒక్కసారిగా మంటలు ప్రమాదవశాత్తు చెలరేగాయి.

దీంతో ఒక్కొక్క గడ్డి వాము కాలడం మొదలు కావడంతో చుట్టూ పక్కల గల రైతులు( Farmers ) ఈ విషయం తెలుసుకుని సంఘటన స్థలంలో కి వెళ్లి చూడగా మంటల్లో చిక్కుకున్న గడ్డమీది నరేష్ కు చెందిన ఆవు దూడ చిక్కుకోగా అక్కడ ఉన్న రైతులు ఆవును కట్టేసిన తాడును విప్పి వేయడంతో ఆవు(Cow ) ప్రాణాలతో బయట పడింది.గడ్డి వాములు కాలుతున్న విషయం తెలుసుకొని మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ గ్రామ పంచాయతీ నీటి ట్యాంకర్ తెప్పించడమే కాకుండా సిరిసిల్ల ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించగా వచ్చి మంటలను ఆర్పింది.

పలువురు రైతులకు చెందిన 15 ఎకరాల గడ్డివాము లు కాలిపోవడంతో సుమారు రెండు లక్షల మేర నష్టపోయారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ కోరారు.

Advertisement
చాట్‌జీపీటీ ఉపయోగించి 40 నిమిషాల్లో అదిరిపోయే యాప్ క్రియేట్ చేశాడు.. కానీ..?

Latest Rajanna Sircilla News