తెలంగాణలో ఏబిఎన్‌

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్ర ఎమ్మెల్యేలను, మంత్రులను, అసెంబ్లీని అవమానించారంటూ టీవీ9 మరియు ఏబిఎన్‌ చానెల్‌పై తెలంగాణ ఎమ్మెస్‌ఓలు బ్యాన్‌ విధించిన విషయం తెల్సిందే.ఇటీవలే టీవీ9 ప్రసారాలను పున: ప్రారంభించారు.

కాని ఏబిఎన్‌ చానెల్‌ను మాత్రం ఇప్పటి వరకు కూడా తెలంగాణలో ప్రసారం కానివ్వడం లేదు.

దాంతో తెలంగాణలో ఏబిఎన్‌ ఆశలు వదులుకుంది.అయితే ఇతర చానెల్‌ను తీసుకుని దానితో తెలంగాణలో నిలదొక్కుకోవాలనే ప్లాన్‌ను ఆంధ్రజ్యోతి రాధా కృష్ణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.తెలంగాణలో సొంత చానెల్‌ కోసం మహాటీవీని రాధాకృష్ణ కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

గత కొన్ని నెలలుగా మహాటీవీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ఆ టీవీని ఏబిఎన్‌ కిందకు తీసుకు వచ్చి, ప్రత్యేక తెలంగాణ చానెల్‌గా మార్చేయాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఉన్నాడు.ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

అయితే రాధాకృష్ణ ప్రయత్నాలు సఫలం అవుతాయా అనేది చూడాలి.ఒక వేళ మహాటీవీని రాధాకృష్ణ దక్కించుకుంటే తెలంగాణలో ఏబిఎన్‌ స్థానంలో ఆ చానెల్‌ వచ్చే అవకాశాలున్నాయి.

Advertisement
టీ కాఫీలు మానేసి రోజు ఉదయం ఈ వాటర్ తాగితే ఎంత లావుగా ఉన్న వారైనా సన్నబడతారు!

తాజా వార్తలు