ఈ ఫోటోలో ఉన్న హీరో ఎవరో గుర్తుపట్టారా?

ఫుల్ స్లీవ్స్ చొక్కా ధరించి, పెద్ద కళ్ళజోడు పెట్టుకొని, మిడ్‌ పార్టీషియన్‌ జుట్టుతో ఉన్న ఈ హీరో ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఇంత డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్న ఈ హీరో ఎవరనుకుంటున్నారా? మన బాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోలలో ఒకరైన అభిషేక్ బచ్చన్.

అయితే అభిషేక్ బచ్చన్ తాజాగా నటిస్తున్న కహానీ త్రిల్లర్ మూవీ చిత్రం షూటింగ్ కోసం ఈ విధమైన లుక్ లో మనకు కనిపించారు.

సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో వచ్చిన కహానీ సినిమాలోని కోల్డ్‌ బ్లడెడ్‌ కిల్లర్‌గా బిస్వాస్‌ పాత్రపై ప్రేక్షకులు తీవ్ర ప్రశంసల వర్షం కురిపించారు.ఈ పాత్రను సస్వతా ఛటర్జీ  పోషించగా.

ప్రస్తుతం ఈ పాత్రలో అభిషేక్ బచ్చన్ నటించనున్నారు.ఈ పాత్ర కోసం అభిషేక్ బచ్చన్ తన లుక్ మొత్తం మార్చేసాడు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

Advertisement

ఈ చిత్ర నిర్మాణం ఈ ఏడాది జనవరి లోనే మొదలైంది.కరోనా కారణం వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడంతో, ప్రస్తుతం తిరిగి కరోనా నిబంధనలు పాటిస్తూ కేవలం అతి కొద్ది మంది సమక్షంలో చిత్ర నిర్మాణం చేపడుతున్నారు.ఇప్పటికే అభిషేక్ బచన్ కరోనా బారిన పడి తిరిగి కోలుకున్న సంగతి మనకు తెలిసినదే.

అందుకోసమే తగినంత జాగ్రత్తలను పాటిస్తూ ఈ చిత్ర నిర్మాణం ఇప్పటికే కలకత్తాలో ప్రారంభమయింది.ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను షారుక్ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుండగా, ప్రముఖ దర్శకుడు అయిన సుజోయ్‌  ఘోష్ కుమార్తె డియా అన్నపూర్ణ ఘోష్ దర్శకురాలిగా ఈ సినిమాతో పరిచయం కానున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన అభిషేక్ బచ్చన్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు