సన్నీ లియోన్ కోరిక తీర్చేసాడు

ఊ అంటే ఆమీర్ ఖాన్ , ఆ అంటే ఆమీర్ ఖాన్ అంటూ ఊదరగొట్టిన సన్నీ లియోన్ కోరిక మొత్తానికి తీరింది.ఆమీర్ పక్కనుంచి వెళ్ళినా అదే చాలు అనుకున్న సన్నీ లియోన్ ని ఏకంగా తన సినిమా సెట్స్ కి ఆహ్వానించేసాడు ఆమీర్.

తనతోపాటు లంచ్ కూడా చేసాడు.ఇదంతా ఎలా జరిగిందంటే .మొన్నామధ్య దంగల్ షూటింగ్ లో భాగంగా డిల్లి వెళ్ళాడు ఆమీర్.అప్పుడు సన్నీ లియోన్ కుడా అక్కడే ఉందట.

కబురు దొరికేసరికి వచ్చి కలవమని చెప్పాడు ఆమీర్.ఈ అవకాశం కోసమే ఇన్నిరోజులు ఎదురుచూసిన సన్నీ వెంటనే వెళ్లి ఆమీర్ ని కలిసిందట.

భర్తతోపాటు దంగల్ సెట్స్ కి రమ్మని ఆహ్వానించాడట అమీర్.ఇంకేం .ఎగిరి గంతేసిన సన్నీ భర్తని వెంటేసుకొని దంగల్ సెట్స్ కి వెళ్ళిపోయింది.ఆమీర్ అంటే ఎందుకంత ఇష్టమో, ఎప్పటినుంచి కలవాలి అనుకుంటుందో .ఇలా అన్ని విషయాలు చెప్పేసిందట సన్నీ.బ్రేక్ లో ఆమీర్ తోపాటే లంచ్ చేసిన సన్నీ షూటింగ్ ప్యాకప్ చెప్పేదాకా సెట్స్ ని విడిచి వేళ్ళలేదంట.

ఇక వెళ్లేముందు ఆమీర్ ని గట్టిగా వాటేసుకొని బై బై చెప్పిందట.స్పెషల్ అభిమాని కాబట్టి ఆమీర్ కూడా ఏమి అనలేకపోయాడు.

ఇదండీ జరిగింది .ఆ వివాదాస్పద ఇంటర్వ్యు వల్ల సన్నీకి చెడు కంటే మంచే ఎక్కువ జరిగింది.చిన్ననాటినుంచీ తీరలేకపోయిన కోరిక ఒక్క వివాదం ద్వారా తీరింది.

ఇక మిగిలింది ఆమీర్ ఖాన్ సరసన సినిమా చేయడమే.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు