కొత్త సినిమా మొదలెట్టిన ఆది సాయి కుమార్

ప్రేమ కావాలి సినిమాతో టాలీవుడ్ లో హీరోగా పరిచయమైన నటుడు ఆది సాయి కుమార్.

మొదటి సినిమాతోనే తన డాన్స్ నటనతో ఆకట్టుకున్న సాయికుమార్ తనయుడు ఆదికి తర్వాత టాలీవుడ్ లో బాగానే అవకాశాలు వచ్చాయి.

ఆ తర్వాత లవ్లీ అనే రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులను మెప్పించిన ఆది కెరియర్ తర్వాత పూర్తిగా గాడి తప్పింది.అతను చేసిన సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి.

కంటెంట్ లో దమ్ము లేకపోవడం, లేదంటే కథనం గాడి తప్పడం వాటి కారణాల వలన అతని కెరీర్ లో వరుసగా డిజాస్టర్స్ చూస్తూ వచ్చారు.ఈ ఏడాదిలో ఆపరేషన్ గోల్డ్ ఫిష్, జోడి, బుర్రకథ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆది సాయికుమార్ కి ఇవి కూడా ఫ్లాప్ టాక్ ని తీసుకొచ్చాయి.

ఇక వరుసగా వస్తున్న ప్లాపుల కారణంగా ఆది మార్కెట్ టాలీవుడ్లో దారుణంగా పడిపోయింది.వెనక వచ్చిన హీరోలు కెరియర్లో మంచి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంటే ఆది మాత్రం చాతికిలబడిపోయాడు.

Advertisement

తండ్రి, తాతలా నటుడుగా ప్రూవ్ చేసుకున్న కూడా కథల ఎంపికలో మాత్రం తడబడుతున్నాడు.ఇదిలా ఉంటే తాజాగా ఆది సాయి కుమార్ మరో కొత్త సినిమా ప్రకటించాడు.

పూరీ జగన్నాథ్ దగ్గర పని చేసిన జిబి కృష్ణ అనే కొత్త కుర్రాడు చెప్పిన సస్పెన్స్ థ్రిల్లర్ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.లో బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మహంకాళీ దివాకర్ అనే వ్యక్తి నిర్మాతగా పరిచయం అవుతున్నాడు.

ఈ సారి తాను ఇప్పటి వరకు చేసిన సినిమాలకి భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఆదికి ఈ సినిమా ఎంత వరకు మైలేజ్ ఇస్తుంది అనేది చూడాలి.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు