హైదరాబాద్ హైదర్ గూడలో కూలిన చెట్టు.. ఒకరు మృతి

హైదరాబాద్ లోని హైదర్ గూడలో భారీ వృక్షం కుప్పకూలింది.ఓల్డ్ ఎమ్మెల్యే క్వాటర్స్ సమీపంలో ఓ ఆటోపై చెట్టు కూలింది.

ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు.సిగ్నల్ పడటంతో వేచి చూస్తున్న సమీపంలో నిలిచిన ఆటోపై చెట్టు ఒక్కసారిగా కుప్పకూలిందని తెలుస్తోంది.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించాయి.అనంతరం రోడ్డుపై చెట్టును తొలగించేందుకు చర్యలు కొనసాగిస్తున్నారు.

ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతుని వివరాల కోసం విచారణ చేస్తున్నారు.

Advertisement
హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?

తాజా వార్తలు