ఈ పొడిని రోజుకు ఒక్క స్పూన్ తిన్నా చాలు.. బోలెడు ఆరోగ్య లాభాలు!

ప్రస్తుత టెక్నాలజీ కాలంలో సగానికి పైగా మంది సంపాదన పైనే దృష్టి పెడుతున్నారు.ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.

కానీ ఆరోగ్యం సరిగ్గా లేకుంటే ఎంత సంపద ఉన్నా సరే అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.అందుకే ఎంత బిజీగా ఉన్నప్పటికీ కాస్తో కోస్తూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.

పోష‌కాలు మెండుగా ఉండే ఆహారాలను డైట్ లో ఉండేలా చూసుకోవాలి.బిజీ లైఫ్ ను లీడ్ చేస్తున్న‌వారికి ఇప్పుడు చెప్పబోయే పొడి చాలా బాగా సహాయపడుతుంది.

ఈ పొడిని రోజుకు ఒక్క స్పూన్ తిన్నా చాలు బోలెడు ఆరోగ్య లాభాలు పొందుతారు.మరి ఆ పొడి ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు బాదం, ఒక కప్పు గుమ్మడి గింజలు, ఒక కప్పు వాల్ నట్స్, ఒక కప్పు అవిసె గింజలు, అర కప్పు చియా సీడ్స్( Chia Seeds ) వేసుకుని మంచి గా డ్రై రోస్ట్ చేసుకోవాలి.

Advertisement

ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న పదార్థాలను పూర్తిగా చల్లారబెట్టుకోవాలి.ఆపై మిక్సీ జార్ తీసుకొని చల్లారబెట్టుకున్న పదార్థాలన్నీ వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్‌ యాలకుల పొడి( Cardamom ), అరకప్పు పట్టిక బెల్లం పొడి వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్‌ చేసుకోవాలి.ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందు ఈ పొడిని వన్ టేబుల్ స్పూన్ చొప్పున నేరుగా తినాలి.రోజు ఈ పొడిని కనుక తీసుకుంటే మీ శరీరానికి ప్రోటీన్, క్యాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ తో స‌హా అనేక పోషకాలు లభిస్తాయి.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే శరీరం ఎనర్జిటిక్ గా ఉంటుంది.

అతి ఆకలి దూరం అవుతుంది.ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.గుండె పోటు, ఆల్జీమర్స్( Alzheimers ) వంటి ప్రమాదకరమైన జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.

అక్కడ ఎన్నికలు పెడితే పూరీ జగన్నాథ్ సీఎం నేను హోం మినిష్టర్.. అలీ ఏమన్నారంటే?
డ్రై ఫ్రూట్స్ తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

వెయిట్ లాస్ అవుతారు.మెదడు పనితీరు మునుపటి కంటే చురుగ్గా మారుతుంది.

Advertisement

జ్ఞాపకశక్తి ఆలోచనాశక్తి రెట్టింపు అవుతాయి.కంటి చూపు పెరుగుతుంది.

జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగడం స్టార్ట్ అవుతుంది.చర్మం కూడా యవ్వనంగా హెల్తీగా ఉంటుంది.

తాజా వార్తలు