ఓ స్కూల్ స్టూడెంట్ మాయలు చేస్తున్నాడు.. అవాక్కవుతున్న స్టూడెంట్స్, టీచర్స్?

బేసిగ్గా మాయలు మంత్రాల గురించి టీచర్ చెబితే స్టూడెంట్స్ నోళ్లెళ్లబెట్టి చూస్తూ వుంటారు.అయితే అదేపని స్టూడెంట్ చేస్తే ఇక టీచర్ల పరిస్థితి ఏమిటి? గర్వంతో పొంగిపోతారు కదూ.

ఇక్కడ కూడా సరిగ్గా అలాంటిదే జరిగింది.ఆ పిల్లాడు అవలీలగా చేస్తున్న మ్యాజిక్ చూసి క్లాస్ స్టూడెంట్స్ మాత్రమే కాదు, టీచర్ కూడా అవాక్కవుతున్నాడు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది.చాలామంది ఈ వీడియోని చూసి, అతగాడికి అలాంటి మ్యాజిక్ ఎట్లా సాధ్యమైందో అంతుచిక్కడంలేదంటూ ఒకింత ఆశ్చర్యపోతున్నారు.వివరాల్లోకి వెళితే.

యూట్యూబ్ లో ఓ వ్యక్తి సదరు వీడియోని పోస్ట్ చేశాడు.ఆ వీడియోలో ఏం వుందా అని చూస్తే, ఓ స్కూలు విద్యార్థి తన రెండు చేతిలో రెండు చింతగింజలను ఉంచుతాడు.

వాటిని ముందుగా అందరికీ చూపిస్తాడు.ఆ తర్వాత తన చేతులను ఆ రెండు చింతగింజలపై పెడుతాడు.

Advertisement

తరువాత కొన్ని సెకనుల తరువాత చేతులను పైకి తీయగా ఒకే చేతిలోకి ఆ రెండు చింతగింజలు వచ్చేస్తాయి.ఆశ్చర్యంగా వుంది కదూ.కానీ ఆ బాలుడు ఇదంతా చాలా సింపుల్ గా చేసేసాడు.అతడి మ్యాజిక్ ను చూసి టీచర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు.

అంత చిన్న వయసులో అలాంటివి చేయడం నిజంగా ఓ అద్భుతం అని నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు.ఎక్కడో టీవీలలో చేస్తోన్న లైవ్ స్టేజెస్ పెర్ఫార్మన్స్ ని తలదన్నేలా ఉందని అందరు అంటున్నారు.

అయితే కొంతమంది నెటిజన్లు ఇంత ఈజీగా ఆ మేజిక్ ఎలా చేయగలిగాడంటూ తెలుసుకోవాలనుందంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇకపోతే, సదరు వీడియోలో స్టూడెంట్, స్కూల్ వివరాలు మాత్రం తెలియడంలేదు.

పోస్ట్ చేసిన వ్యక్తి ఆ వివరాలను పొందుపరచలేదు.ఈ వీడియోని చూసి, మీకు ఆ కుర్రాడి వివరాలు తెలుసునేమో కాస్త చెప్పండి.

రామ్ చరణ్ ఆ విషయం లో ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాడు..?
Advertisement

తాజా వార్తలు