భార్య బాధిత టెక్కీ 'అతుల్ సుభాష్‌'కు ఓ రెస్టారెంట్‌ వినూత్నరీతిలో నివాళి!

కొన్ని రోజుల క్రితం భార్య బాధిత బెంగుళూరు టెక్కీ(Bangalore Techie) సోషల్ మీడియాలో తన భార్యమీద ఓ వీడియో రికార్డ్ పోస్ట్ పెడుతూ ఆత్మహత్య చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ క్రమంలో బాధితుడికి సోషల్ మీడియా వేదికగా అనేకమంది అండగా నిలిచారు.

ఈ క్రమంలోనే భార్య బాధిత టెక్కీ అతుల్ సుభాష్‌(Atul Subhash)కు ఓ రెస్టారెంట్‌(restaurant) వినూత్నరీతిలో నివాళి అందించింది.అవును, సాధారణంగా మనం ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్తే.

అక్కడ మెనూ కార్డులు, బిల్లులు మాత్రమే మనకి కనిపిస్తాయి.కానీ ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ కు వెళితే వాళ్ల మనసులోని భావాన్ని కూడా మనం చదవవచ్చు.

ముఖ్యంగా బెంగళూరు టెక్కీ ఆత్మహత్య చేసుకోవడంపై వారు ఏమనుకుంటున్నారో ఇక్కడ తెలుసుకోవచ్చు.

Advertisement

గత వారం రోజులుగా హాట్ టాపిక్‌గా మారిన ఈ విషయంపై ఢిల్లీ రెస్టారెంట్ ( Delhi Restaurant)తమదైన స్టైల్‌లో స్పందించింది."జంబోకింగ్" (Jumboking)అనే రెస్టారెంట్ టెక్కీ అతుల్ సుభాష్ మృతికి వినూత్నంగా నివాళి అందించింది.విషయం ఏమిటంటే.

హౌజ్‌ఖాస్ అనే గ్రామంలోని జంబోకింగ్ ఫ్రాంచైజీకి వెళ్లిన ఓ వ్యక్తి.భోజనం ఆర్డర్ చేసుకొని కడుపు నిండా భోజనం తిన్నాడు.

ఆపై బిల్లు తీసుకురమ్మని చెప్పగా సర్వర్ తెచ్చిన బిల్లు చూసిన కస్టమర్ షాక్ అయ్యాడు.ఆయన షాక్ అయింది బిల్లు చూసి కాదు.

దానికి కింద ఉన్న మెసేజ్ చూసి.ఆ మెసేజ్‌లో హోటల్ యాజమాన్యం మనసులో అతుల్ సుభాష్ గురించి ఏమనుకుంటున్నారో అక్కడ రాసిపెట్టి ఉండడం దానికి కారణం.

మంచి మనసు చాటుకున్న శర్వానంద్... కూతురి పేరుతో అలాంటి సేవ!
వైరల్: బ్యాంకు క్యాషియర్ మెడపై కత్తి పెట్టి, డబ్బులు ఇవ్వాలని బెదిరించిన దొంగ!

అవును."బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్యకు మేము ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం.

Advertisement

అతని జీవితం అందరిలాగే చాలా ముఖ్యమైంది.మీకు ప్రశాంతత దొరుకుతుందని కోరుకుంటున్నాం!" అని ఉంది.

ఇక బిల్లు చివరన ఉన్న ఈ మెసేజ్ చదివిన కస్టమర్.హోటల్ యజమాని వద్దకు వెళ్లి దీని గురించి అడగగా.

తాము అతుల్ సుభాష్‌కు నివాళులు, మద్దతు తెలపడంతో పాటు అందరికీ అవగాహన కల్పించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారని వివరించారు.

నిజంగా సూపర్ కదూ.ఇక బెంగళూరుకు చెందిన టెక్కీ అతుల్ సుభాష్(Atul Subhash).భార్య, అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకోవడంతో ఆ విషయం దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యింది.24 పేజీల సూసైడ్ నోట్ రాసి పెట్టి మరీ చనిపోగా.అందులో భార్య తనను ఎలా వేధించిందో పూసగుచ్చినట్టు వివరించాడు.

మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన వైవాహిక చట్టాలను ఆమె ఎలా దుర్వినియోగం చేసిందో కూడా అందులో అతడు వెల్లడించడంతో దేశ వ్యాప్తంగా ఉన్న భార్య బాధితులు.ఆయనకు మద్దతు నిలిచారు.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూనే.ఆయన భార్య, అత్త, మామలకు కఠినంగా శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో వారిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేసిన సంగతి విదితమే.

తాజా వార్తలు