28 మంది భార్యల సమక్షంలో 37వ పెళ్లి !

ఒకవైపు కరోనా .మరోవైపు ఆర్థికంగా చితికిపోయిన దుస్థితి దాదాపు అందరిది.ఇలాంటి సందర్భంలో ఓ విస్తుపోయే పనిచేశాడు పెద్దాయన.

ఆయన పెళ్లి చేసుకున్నాడు.పెళ్లి అయితే విస్తూపోవడం ఏంటి అనుకోకండి.ఒకటి.

కాదు.రెండు.

కాదు ఆయన చేసుకున్నది 37వ పెళ్లి.అది కూడా మిగతా భార్యాల సమక్షంలో జరుపుకున్నాడు.

Advertisement
A Man 37 Th Marriage In Front Of 28 Wives Video Viral, Nagaland, Marriage. 37 T

ఇప్పటికే పెళ్లి చేసుకుందాం అంటే అమ్మా యిలు దొరకడం లేదని బాధపడుతున్నవారు కొందరుంటే.ఓ పెద్దాయన మాత్రం ఏకంగా 37 పెళ్లిలు చేసేసుకున్నాడు.

అది ఆయన లక్ష్యమంట.ఆ వివరాలు తెలుసుకుందాం.

పెళ్లంటే నూరేళ్ల పంట అని ఏకంగా నూరు పెళ్లిల్లు చేసుకోవడమే ఈయన టార్గెట్‌.ఒక్క పెళ్లికే నానా తంటాలు పడుతున్న వారు ఉన్నారు.

కానీ, ఈ ముసలాయనకు 36 పెళ్లిల్లు చేసుకుని ఆ భార్యాల సమక్షంలోనే తాజాగా 37 వ పెళ్లి సంబరంగా చేసుకున్నాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
రోడ్డుపై గొనె సంచిలోనుండి అరుపులు.. తెరిచి చూడగా షాకింగ్ సిన్!

ఆయనకు ఇప్పటికే 35 మంది సంతానం.వారి ద్వారా 126 మంది మనవళ్లు, మనవరాళ్లు, ముని మనవళ్లు కూడా ఉన్నారు.

Advertisement

నాగాలాండ్‌ సంప్రదాయం ప్రకారం వధువు చెవిలో తన ఇష్టాన్ని వ్యక్తం చేసీ, పెళ్లి తంతును కానిచ్చాడు.అంగరంగ వైభవంగ జరిగిన ఈ పెద్దాయన పెళ్లి వేడుకను చూసిన నెటిజెన్లు రకరకాల పోస్టులు పెడుతున్నారు.

మొత్తానికి ఈ పెద్దాయిన టార్గెట్‌ చాలా పెద్దది.అతను దాదాపు వంద పెళ్లిల్లు చేసుకుని వేయ్యిమంది పిల్లల్ని కనే లక్ష్యం పెట్టుకున్నాడట.

తన ఉద్దేశాన్ని పెళ్లికి ముందే చేసుకోబోయే అమ్మాయికి చెబుతాడు.వారు దీనికి అంగీకరించే పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు.ఈ పెళ్లికి సంబంధించిన ఓ వీడియోను నాగాలాండ్‌ పోలీస్‌ ఐపీఎస్‌ అధికారి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

ఇది ప్రస్తుతం వైరల్‌గా మారి సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.ఇక ఈ పెద్దాయన ముందుగానే చేసుకోబోయే అమ్మాయి తన టార్గెట్‌కు అంగీకరించే చేసుకోవడంతో .దానికి మిగతా భార్యలు కూడా నో చెప్పకపోవడంతో ఈ పెద్దాయన టార్గెట్‌కు అడ్డు లేకుండా పోయింది.అందరూ ఏకిభవించి పెళ్లి జరిపిస్తున్నారు.

ఏదేమైన కాటికి కాలు చాపుకొన్న ముసలాయన ఇలా వరుస పెళ్లిళ్లు చేసుకోవడం.అంతమందితో సంసార జీవితాన్ని ఓపిగ్గా లాక్కొస్తున్నందుకు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే!.

తాజా వార్తలు