ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి ప్రాజెక్టు పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి.సీఎం వైఎస్ జగన్ ఈ ప్రాజెక్ట్ నీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు త్వరగా కంప్లీట్ చేయడానికి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పనులు వేగవంతం చేస్తూ వస్తున్నారు.
గత ఏడాది డిసెంబర్ మాసంలో పనులను పరిశీలించిన జగన్ ఇటీవల జూలై మాసంలో మరోసారి ప్రాజెక్టు పనులను సమీక్షించారు.ఇదే తరుణంలో ఇటీవల కేంద్ర జలవనరుల శాఖ.
కూడా ప్రాజెక్ట్ నిధులకు సంబంధించి సానుకూలంగా స్పందించడంతో పనులు వేగవంతం అయ్యాయి.
ఇదిలా ఉంటే పోలవరం ప్రాజెక్టు లో కీలక పనులు స్టార్ట్ అయ్యాయి. ప్రాజెక్టు దిగువ కాఫర్ డ్యాండాయ ఫ్రం వాల్ పనులు పూజలు చేసి స్టార్ట్ చేయడం జరిగింది.10 మీటర్ల లోతు 96 మీటర్ల పొడవు 2 మీటర్ల వెడల్పు తో ఈ వాల్ నిర్మాణం జరగనుంది.దిగువ కాఫర్ డ్యాం పొడవు 1613, ఎత్తు 30.5 మీటర్లు.పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి క్లైమాక్స్ లో ఈ పనులు కీలకం కావడంతో త్వరలోనే ఈ పనులు పూర్తి కానున్నట్లు, దీంతో దాదాపు ప్రాజెక్టు పనులు పూర్తి అయినట్లు అధికారులు చెబుతున్నారు.