మంగళగిరి నుంచే పోటీ ! అన్ని విషయాలపై లోకేష్ క్లారిటీ 

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే నియోజకవర్గంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) మరోసారి క్లారిటీ ఇచ్చారు.  తాను మంగళగిరి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, తాను గెలిస్తే ఈ నియోజకవర్గ రూపు రేఖలు మారుస్తాను అంటూ లోకేష్ హామీ ఇచ్చారు.

 Competition From Mangalagiri Nara Lokesh Clarity On All Matters , Mangalagiri,-TeluguStop.com

మంగళగిరిలో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన లోకేష్ అన్ని విషయాల పైన క్లారిటీ ఇచ్చారు.పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని, అని వర్గాల ప్రజలు కలిసి జీవిస్తున్న మంగళగిరి ఒక మినీ ఆంధ్రప్రదేశ్ అంటూ లోకేష్ కితాబు ఇచ్చారు.పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నప్పుడు మంగళగిరి గుర్తుకు వచ్చేదని లోకేష్ అన్నారు.‘ గతంలో ఇక్కడ ఓడిపోయినప్పటికీ నేను నియోజకవర్గాన్ని వీడలేదు అని, మళ్లీ మంగళగిరి నుంచి పోటీ చేయాలనుకుంటున్నావా అని చంద్రబాబు అడిగారు.ఇక్కడే పోటీ చేసి గెలవాలని  నిశ్చయించుకున్నానని చెప్పా.

Telugu Allaramakrishna, Ap, Ap Governemtn, Chandrababu, Jagan, Mangalagiri, Loke

వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో నన్ను గెలిపిస్తే చంద్రబాబుతో పోరాడి ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతాను’ అంటూ లోకేష్ క్లారిటీ ఇచ్చారు.ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.రెండుసార్లు ఇక్కడ వైసిపి అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి( Alla ramakrishna reddy )ని గెలిపించినా అభివృద్ధి జరగలేదని,  ఇప్పుడు ఆ ఎమ్మెల్యేనే పారిపోయే పరిస్థితి వచ్చిందని లోకేష్ విమర్శించారు.

మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే మంత్రివర్గంలోకి తీసుకుంటానని చెప్పిన జగన్ ,మాట తప్పి మడమ తిప్పారని ఎద్దేవా చేశారు.ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎటువంటి నిధులు కేటాయించలేదని మండిపడ్డారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరికల విషయంపై లోకేష్ క్లారిటీ ఇచ్చారు.

Telugu Allaramakrishna, Ap, Ap Governemtn, Chandrababu, Jagan, Mangalagiri, Loke

టిడిపి శ్రేణులను ఇబ్బంది పెట్టిన వారెవరిని పార్టీలో చేర్చుకోబోమని లోకేష్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.ఎన్నికలకు వంద రోజులు మాత్రమే ఉన్నందున ప్రతి కార్యకర్త ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని, ప్రజల వద్దకు వెళుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకోవాలని, టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇవ్వాలని లోకేష్ సూచిస్తున్నారు.ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో గెలిచి తనపై ఇప్పటివరకు వచ్చిన అన్ని విమర్శలను తిప్పికొట్టాలి అనే పట్టుదలతో లోకేష్ ఉన్నారు.

అందుకే గెలుపుతో పాటు, భారీ మెజారిటీ పైన ఆయన లెక్కలు వేసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube