జుట్టు కుదుళ్ల‌ను దృఢంగా మార్చి రాల‌డాన్ని త‌గ్గించే హెర్బ‌ల్ ప్యాక్ మీకోసం!

ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాల కొర‌త‌, రెగ్యుల‌ర్‌గా షాంపూ చేసుకోవ‌డం, త‌డి జుట్టును దువ్వ‌డం, హెయిర్ స్టైలింగ్ టూల్స్‌ను అధికంగా వినియోగించ‌డం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల జుట్టు కుదుళ్లు బ‌ల‌హీనంగా మారిపోతాయి.కుదుళ్లు బ‌ల‌హీన‌ప‌డితే.

హెయిర్ ఫాల్ స‌మ‌స్య విప‌రీతంగా పెరిగిపోతుంది.అందుకే జుట్టు కుదుళ్ల‌ను బ‌లోపేతం చేసుకోవ‌డం ఎంతో ముఖ్యం.

అందుకు ఇప్పుడు చెప్ప‌బోయే హెర్బ‌ల్ ప్యాక్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి ఆ హెర్బ‌ల్ ప్యాక్ ఏంటో.

దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా రాత్రి నిద్రించే ముందు ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల మెంతులు వేసి, వాట‌ర్ పోసి నాన‌బెట్టుకోవాలి.

Advertisement

ఉద‌యాన్నే ఒక క‌ల‌బంద ఆకును తీసుకుని వాట‌ర్‌తో శుభ్రంగా క‌డిగి జెల్‌ను స‌ప‌రేట్ చేసి పెట్టుకోవాలి.ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో నైట్ అంతా నాన‌బెట్టుకున్న మెంతులను వాట‌ర్‌తో స‌హా వేసుకోవాలి.

అలాగే స‌ప‌రేట్ చేసి పెట్టుకున్న క‌ల‌బంద జెల్‌, రెండు రెబ్బ‌ల క‌రివేపాకు, రెండు టేబుల్ స్పూన్ల పుల్ల‌టి పెరుగు, రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మ‌ట్టి, వ‌న్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్‌, వ‌న్ టేబుల్ స్పూన్ కొబ్బ‌రి నూనె వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మాన్ని జుట్టు కుద‌ళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు అప్లై చేసి ష‌వ‌ర్ క్యాప్‌ను ధ‌రించాలి.

గంట లేదా గంట‌న్న‌ర అనంత‌రం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒక్క‌సారి ఈ హెర్బ‌ల్ ప్యాక్ ను వేసుకుంటే జుట్టు కుదుళ్లు దృఢంగా, బ‌లంగా మార‌తాయి.దాంతో జుట్టు రాల‌డ‌టం క్ర‌మంగా త‌గ్గి ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది.

మ‌రియు చుండ్రు స‌మ‌స్య సైతం దూరం అవుతుంది.కాబ‌ట్టి, ఈ హెర్బ‌ల్ హెయిర్ ప్యాక్‌ను త‌ప్ప‌కుండా ట్రై చేయండి.

ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?
Advertisement

తాజా వార్తలు