సల్మాన్ ఖాన్ వల్ల పేరు మార్చుకున్న కియారా అద్వానీ.. ఆమె అసలు పేరు ఏంటంటే?

కొన్ని కొన్ని సార్లు నటీనటులు పేర్లు మార్చుకునే పరిస్థితులు ఏర్పడుతుంటాయి.కొందరికి సొంత పేర్లు కంటే తాము నటించిన సినిమా పరంగా పేర్లు వస్తుంటాయి.

 Kiara Advani Who Changed Her Name Because Of Salman Khan Details,  Salman Khan,b-TeluguStop.com

మరికొందరికి ఇండస్ట్రీలో మరెవరైనా తమ పేరు తోనే ఉంటే మార్చుకునే సందర్బం ఉంటుంది.అలా ఒక హీరోయిన్ కు కూడా తన సొంతం పేరు మార్చుకోవాల్సి ఉంటుంది.

ఇంతకూ ఆమె ఎవరు అంటే.

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బ్యూటీ కియారా అద్వానీ.

తన అందంతో ఎంతో మంది కుర్రాళ్ళ మనసులను దోచుకుంది.టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా ఈ ముద్దుగుమ్మ పరిచయమే.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రేంజ్ హైలో ఉంది.అతి తక్కువ సమయంలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ఫగ్లీ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడంతో ఎంఎస్ ధోని సినిమాలో అవకాశాన్ని అందుకుంది.ఇందులో కూడా మంచి సక్సెస్ అందుకుంది.

దాంతో టాలీవుడ్ లో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.ఈ ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను అభిమానులను మార్చుకుంది.

అలా చాలా వరకు మంచి సక్సెస్ లను అందుకుని టాప్ పొజిషన్ లో స్థానం దక్కించుకుంటుంది.ఇక సోషల్ మీడియాలో మాత్రం తన ఫోటోలతో బాగా సందడి చేస్తుంది.

ఎప్పటికప్పుడు ఫోటో షూట్ లు చేయించుకుంటూ తన ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటుంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.

ఇక ఈ బ్యూటీ గతంలో సిద్ధార్థ్ మల్హోత్రా అనే మరో బాలీవుడ్ యంగ్ హీరోతో ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ లో బాగా టాక్ వినిపించింది.పైగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని, కొన్ని కొన్ని ట్రిప్స్ లలో కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెగ వార్తలు వినిపించాయి.పైగా కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.పైగా వీరు పెళ్లి చేసుకుంటారు అని కూడా తెలిసింది.కానీ కియరా అతడితో రిలేషన్ లో లేను అని కేవలం ఫ్రెండ్ అని చెప్పుకొని వచ్చింది.కానీ జనాలు మాత్రం ఆమె మాటలను తోసిపుచ్చారు.

ఇక వీరిద్దరు కలిసి ఇటీవలే షేర్షా అనే సినిమాలో కూడా నటించారు.

ఇదిలా ఉంటే కియారా అద్వానీ సల్మాన్ ఖాన్ చెప్పడం వల్ల తన పేరు మార్చుకుందట.తన అసలు పేరు అలియా అద్వానీ అట. కానీ అప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో అలియా భట్ ఉండటంతో సల్మాన్ ఖాన్ తనను కియారా అద్వానీగా పేరు మార్చుకోమని చెప్పాడట.దీంతో ఆమె కూడా అప్పటినుంచి అదే పేరుతో ఇండస్ట్రీలో ఏలుతుంది.ఓకే ఇండస్ట్రీలో ఒకే పేరుతో ఇద్దరు హీరోయిన్లు ఉంటే స్టార్ హీరోయిన్స్ కాలేరు అనే ఉద్దేశంలో తనకు పేరు మార్చుకోమని సలహా ఇచ్చాడట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube