మంచు నీటిలో చిక్కుకున్న కుక్క‌.. ప్రాణాల‌కు తెగించి కాపాడిన పోలీసులు

యూరోపియన్ దేశమైన స్పెయిన్ లో పోలీసులు చేసిన ఓ మంచి పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఇక యూరప్ లో మంచు వర్షాలు పడడం చాలా కామన్.

మన దేశంలో మంచు వర్షం అంటే ఏదో వింతలా చూస్తారు కానీ ఐరోపా ఖండంలో మాత్రం జనాలు చాలా లైట్ తీసుకుంటారు.అంతలా మంచు వర్షాలకు ఇక్కడి జనాలు అలవాటు పడిపోయారు.

ఇక ఇదే నెలలో క్రిస్మస్ వేడుకలు కూడా ఉండడంతో జనాలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.మంచు వర్షంలో తడుచుకుంటూనే క్రిస్మస్ వేడుకలకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు.

కానీ ఒక్కో సారి ఈ మంచు వర్షం వలన అనేక ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటున్నారు.మంచు దెబ్బకు అన్నీ గడ్డ కట్టుకుపోయి ఘోరమైన కష్టాలను అనుభవిస్తున్నారు.

Advertisement

కేవలం మనుషులు మాత్రమే కాకుండా ఈ మంచు వర్షాల వలన మూగ జీవాలు కూడా ఇబ్బందులకు గురి అవుతున్నాయి.ఐరోపా ఖండంలోని స్పెయిన్ లో ప్రస్తుతం మంచు వర్షం వలన ప్రజలు అనేక రకాలుగా సఫర్ అవుతున్నారు.

ఇలా నిరంతరాయంగా కురుస్తున్న మంచు వర్షం ప్రభావంతో అక్కడి జలపాతాలు, నదులు అన్నీ గడ్డకట్టుకుపోయాయి.

ఇలా గడ్డకట్టుకుపోయిన ఓ రిజర్వాయర్ లో ఓ కుక్క చిక్కుకుంది.ఇది గమనించిన గ్వార్డియాకు చెందిన ఇద్దరు పోలీసులు తమ ప్రాణాలకు తెగించి ఆ చల్లటి ఐస్ నీటిలోకి దిగి ఆ కుక్కను కాపాడారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైరల్ గా మారిన ఈ వీడియోను అనేక మంది నెటిజన్లు లైక్ చేస్తున్నారు.వీడియో చూసిన తర్వాత వివిధ రకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూసేయండి.ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.

Advertisement

తాజా వార్తలు