చదువుతో సంబంధం లేకుండా.. ప్లాస్టిక్ వ్యర్థాలతో పెట్రోల్ తయారు చేస్తూ అబ్బురపరుస్తున్న యువకుడు..!

ప్లాస్టిక్‌ ప్లాస్టిక్‌ ప్లాస్టిక్‌.తాగే నీళ్లు పట్టడానికి ప్లాస్టిక్‌.తినే అన్నం కట్టడానికి ప్లాస్టిక్‌.

పల్లె.పట్నం, కొండ.కోన, గాలి.

నేల అన్న తేడా లేకుండా ఆర్కిటిక్‌ నుంచి అంటార్కిటిక్‌ దాకా, భూమండలాన్ని చుట్టేసిన ప్లాస్టిక్ ఇప్పుడు పర్యావరణానికి ప్లాస్టిక్‌ ఓ పెనుభూతంగా తయారయింది.అయితే అలాంటి పాలిథీన్​, ప్లాస్టిక్​ బాటిళ్లతో.

పెట్రోల్, గ్యాస్ తయారుచేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు.అన్ని రకాల ప్లాస్టిక్‌ చెత్తను నాణ్యమైన ముడి చమురుగా మార్చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు ఒడిశాకు చెందిన ఓ యువకుడు.

Advertisement

చదివింది ఏడో తరగతి అయినప్పటికీ.చదువుకు ప్రతిభకు సంబంధం లేదని ఆ యువకుడునిరూపిస్తున్నాడు.

ఇంతకీ ఆ యువకుడు ఎవరు.? ప్లాస్టిక్, పాలిథీన్ తో పెట్రోల్ ఎలా తయారు చేస్తున్నాడో ఓసారి తెలుసుకుందాం.వృథాగా పోయే ప్లాస్టిక్ బాటిళ్లు, పాలిథీన్ వస్తువులను ఉపయోగించి పెట్రోల్​ను తయారు చేస్తున్నాడు రాధాచరణ్​పుర్​లో ఉండే అజయ్.

రోజుకు 12 నుంచి 13 కేజీల పాలిథీన్​ను సేకరించి దాని సాయంతో సుమారు 7-8 లీటర్ల పెట్రోల్​ను తయారుచేస్తున్నాడు.నేల, నీరును కలుషితం చేస్తున్న ప్లాస్టిక్​ను తగ్గించడంలోనూ అతడు కీలక పాత్ర పోషిస్తున్నాడు.

​తన లక్ష్యం కోసం సొంత బైక్​ను 80 వేల రూపాయలకు అమ్మేశాడు.స్నేహితుల వద్ద కొంత అప్పు చేసి.

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
వైరల్ వీడియో : రేవ్ పార్టీలో యాక్టర్ రోహిణి నిజంగానే దొరికిందా లేక ప్రాంకా..?

పెట్రోల్ తయారుచేసే యంత్రాన్ని​ కొన్నాడు.

Advertisement

అలా పాలిథీన్, వాటర్​ బాటిళ్లను నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద మండించి పెట్రోల్​ను తయారు చేస్తున్నాడు అజయ్.ఒక కేజీ పాలిథీన్​తో 600 గ్రాముల పెట్రోల్​ తయారవుతుందని అంటున్నాడు.తాను తయారుచేసిన లీటర్​ పెట్రోల్​తో బైక్​పై 50 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని.

ప్రభుత్వం సాయం చేస్తే మరిన్ని పరిశోధనలు చేస్తానని, తక్కువ ధరకే పెట్రోల్​ లభిస్తుందని అంటున్నాడు.

తాజా వార్తలు