మెట్రో స్టేషన్ లోని గ్రిల్ లో ఇరుక్కుపోయిన చిన్నారి.. జవాన్ ఎలా కాపాడాడో చూడండి..

చిన్నపిల్లలు ఒక చోట అసలు ఉండరు వారికి తెలియకుండానే ప్రమాదం వైపు వెళుతూ ఉంటారు.అది ప్రమాదమని తెలిసేలోపు ప్రమాదం జరిగి పోతూ ఉంటుంది.

  చిన్న పిల్లల విషయంలో అందుకే పిల్లల తల్లి దండ్రులు వారి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.అలా లేకపోతే ఏం జరుగుతుందో మనకు తెలుసు.

ఇప్పుడు ఒక చిన్న పిల్ల కూడా ఇలాంటి ప్రమాదం లోనే ఇరుక్కు పోయింది.వివరాల్లోకి వెళితే.

ఈ సంఘటన ఢిల్లీ మెట్రో స్టేషన్ లో జరిగింది ఒక చిన్నారి ఆడుకుంటూ తనకు తెలియ కుండానే తన ముందున్న ప్రమాదం ఏంటో తెలుసు కోకుండానే ప్రమాదంలో చిక్కుకుంది ఈ చిన్నారి.ఈ చిన్నారి ఆడుకుంటూ అక్కడ ఉన్న గ్రిల్స్ లో ఇరుక్కు పోయింది.

Advertisement

ఈ చిన్నారి నిర్మాణ్ విహార్ సమీపంలో నివాసం ఉంటుంది.ఈ చిన్నారి వయసు ఎనిమిదేళ్లు కాగా అను కోకుండా 25 ఫీట్ల ఎత్తు ఉన్న ఫెన్సింగ్ వల్ల ఇరుక్కు పోయింది.

ఈ చిన్నారి ఒకవేళ కాలు అదుపుతప్పి కింద జారి పడిపోతే ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది.దీంతో ఈ చిన్నారి భయంతో అరుపులు మొదలు పెట్టింది.

దాంతో అక్కడున్న స్థానికులు అందరూ పాపను కాపాడటానికి సమీప పోలీసులకు సమాచారం అందించారు.ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఆ పాపను రక్షించడమే ఉద్దేశంగా స్టేషన్లో ఉన్న ఓ సీఐఎస్​ఎఫ్ జవాను అప్రమత్తమై.ఈ చిన్నారిని చాలా తెలివిగా కాపాడారు ఈ జవాన్.

ఈ జవాన్ తన ప్రాణాలను పణంగా పెట్టి చిన్నారి ని కాపాడి వారి తల్లిదండ్రులకు భద్రంగా అప్పగించారు.ఇక ఈ జవాన్ చిన్నారి ని కాపాడి తల్లిదండ్రులకు అప్పగించడంతో వారు సంతోషంతో జవాన్ కి కృతజ్ఞతలు తెలిపారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

వీడియో ని చూసిన వారందరూ కూడా సంతోషంతో సీఐఎస్​ఎఫ్ జవానుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.జవాన్ చేసిన ఈ పని హర్షించదగిన దని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు