పాము తోక పట్టుకుని లాగిన బాలుడు.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

చాలా మందికి పాము( Snake ) పేరు వింటేనే భయం పుడుతుంది.అలాంటిది పామును ప్రత్యక్షంగా చూస్తే చాలా మంది ఆమడ దూరం పరుగులు పెడతారు.

ఎంత పెద్ద వారికైనా పాము అనగానే మనసులో కొంచెం అయినా భయం ఉంటుంది.అవి కాటు వేస్తే కొన్ని నిమిషాల వ్యవధిలోనే అంతా చనిపోతారు.

అందుకే పామును చూడగానే భయస్తులు అయితే పారిపోతారు.కాస్త ధైర్యం ఉన్న వారు కొట్టి చంపేస్తారు.

భక్తి భావం ఉన్న వారు అయితే పుట్టలో పాలు పోసి పూజిస్తారు.ఏదేమైనా పాముల వద్దకు వెళ్లడం అంత మంచిది కాదు.

Advertisement

అయితే ఓ బాలుడు మాత్రం ఏ మాత్రం భయం లేకుండా ప్రవర్తించాడు.ఏకంగా పాము తోక పట్టుకుని లాగాడు.

అది ఎంత పెద్ద పాము అయినా ఏ మాత్రం భయపడలేదు.ఆ భారీ పాముకు చుక్కలు చూపించాడు.

ఇక పాము కూడా ఆ బాలుడికి భయపడింది.బాలుడి నుంచి తప్పించుకుందామని ప్రయత్నించింది.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఆ బాలుడు( Boy ) భయం లేకుండా పాముతో ఆడుకుంటున్నాడు.

ఏంటి భయ్యా.. స్వీట్ షాప్ కు స్వీట్స్ కొనడానికి వచ్చాయా ఏంటి ఎలుకలు(వీడియో)
వీడియో: ట్రైన్ బోగీ మెట్లపై కూర్చున్న వ్యక్తి.. జారిపోవడంతో..?

ఇది కొందరికి వినోదంగా అనిపిస్తున్నా చాలా మంది నెటిజన్లు ఆ బాలుడిని వీడియో తీసిన వారిని తప్పుపడుతున్నారు.తెలియక పాముతో ఆడుకుంటుంటే పెద్ద వారు ఏం చేస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

బాలుడిని పాము కాటు వేస్తే, నోరు లేని ఆ చిన్నారి చెప్పుకోగలడా అని నిలదీస్తున్నారు.

అయితే మరికొందరు నెటిజన్లు ఇంకోలా స్పందిస్తున్నారు.సోషల్ మీడియా( social media )లో లైక్‌ల కోసం కొందరు ఇలాంటి ట్రిక్స్ చేస్తుంటారని, అది బొమ్మ పాము అయి ఉంటుందని, నిజమైన పాము కాదని సందేహం వ్యక్తం చేస్తున్నారు.ఏదేమైనా ఇలా చిన్నారులను పాముల వద్దకు పోనియ్యడం అంత మంచిది కాదు.

అందులోనూ ఇటీవల సోషల్ మీడియాలో తమ వీడియోల కోసం చిన్నారుల ప్రాణాలతో పెద్దలు చెలగాటం ఆడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

తాజా వార్తలు