కిడ్నీలో ఏకంగా పెద్ద బండ బయటపడింది.. దెబ్బతో గిన్నిస్ రికార్డ్ క్రియేట్ అయింది!

కిడ్నీలో రాళ్లు( Kidney stones ) ఏర్పడడం గురించి అందరికీ తెలిసిందే.

ఎందుకంటే ఇక్కడ దాదాపు ప్రతీ ఇద్దరిలో ఒక్కరికి ఈ సమస్య అనేది సాధారణంగా ఉంటుంది కాబట్టి.

అయితే ఆ రాళ్లు అనేవి చిన్నచిన్న సైజులో ఉంటాయి.అలాగే ఇవి చాలా వరకు వాటంతట అవే శరీరం నుంచి యూరిన్ ద్వారా బయటకు వెళ్లిపోతుంటాయి.

అరుదుగా కొన్ని సందర్భాల్లో మాత్రమే సర్జరీ చేయాల్సి ఉంటుంది.మహా అయితే అవి 5 సెంటీమీటర్ల పరిమాణం కన్నా తక్కువగానే ఉంటాయి.అయితే శ్రీలంకలో ( Sri Lanka )మాత్రం ఓ వ్యక్తి కిడ్నీలో ఏకంగా 13.372 సెం.మీ (5.264 అంగుళాలు) పరిమాణంలో 801 గ్రాములు ఉన్న ఓ కిడ్నీస్టోన్ ను వైద్యులు తొలగించారు.దాంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

ఇది కిడ్నీలో చిన్న సైజు బండ మాదిరిగా తయారైంది.ఇప్పటి వరకు ప్రపంచంలో అతిపెద్ద కిడ్నీ స్టోన్ ఇదే అని కొలంబోలోని ఆర్మీ హస్పిటల్( Army Hospital, Colombo ) వైద్యులు చెప్పగా అతి పెద్ద కిడ్నీ స్టోన్ గా ఇది రికార్డులకు ఎక్కడం విశేషం.అవును, ప్రపంచంలో ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు సంపాదించింది.

Advertisement

చివరి సారిగా 2004లో భారత దేశంలో 13 సెంటీమీటర్ల కిడ్నీ స్టోన్ పేరిట ఈ రికార్డు ఉండగా ప్రస్తుతం ఈ రికార్డ్ బద్దలైంది.అంతకు మునుపు పాకిస్తాన్లో అత్యంత బరువు 620 గ్రాములు ఉన్న కిడ్నీ స్టోన్ నమోదు కావడం విశేషం.

కాగా, ఈ నెల ప్రారంభంలో బాధిత వ్యక్తి కిడ్నీ నుంచి ఈ రాయిని వైద్యులు సర్జరీ చేసి విజయవంతంగా తొలగించారు.కన్సల్టెంట్ యూరాలజిస్ట్ లెఫ్టినెంట్ కల్నల్ (డా) కె.సుదర్శన్( K.Sudarshan ), హాస్పిటల్‌లోని జెనిటో యూరినరీ యూనిట్ హెడ్, కెప్టెన్ (డా) W.P.S.C పతిరత్న, డాక్టర్ థమాషా ప్రేమతిలకతో కలిసి ఈ శస్త్రచికిత్సకు నాయకత్వం వహించినట్టు తెలుస్తోంది.కల్నల్ (డా) U.A.L.D పెరెరా, కల్నల్ (Dr) C.S అబేసింగ్ కూడా శస్త్రచికిత్స సమయంలో కన్సల్టెంట్ అనస్తీటిస్టులుగా సహకరించారని శ్రీలంక ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement

తాజా వార్తలు