మహేష్ - త్రివిక్రమ్ మధ్య డీల్ కుదిరింది

మహేష్ బాబుకి ఇండస్ట్రీలో ఉన్న అతికొద్దిమంది మిత్రుల్లో త్రివిక్రమ్ ఒకరు .

సినిమా వాళ్లతో పెద్దగా కలిసి ఉండని సూపర్ స్టార్ , త్రివిక్రమ్,పూరి జగన్నాథ్, శ్రీను వైట్లతో మాత్రం చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటాడు.

ఇప్పుడు అదే స్నేహంతో మహేష్ తో ఒక డీల్ కుదుర్చుకున్నాడు త్రివిక్రమ్.విషయంలోకి వెళ్తే, గత ఏడు రోజుల్లో, రెండుసార్లు మహేష్ ని కలిసాడు త్రివిక్రమ్.

కథాచర్చలు జరుపుతూనే, బ్రహ్మోత్సవం, అ.ఆ చిత్రాల కోసం ఒక డీల్ మాట్లాడుకున్నారు.అదేంటంటే, బ్రహ్మోత్సవం, అ.ఆ ఒకేరోజు విడుదల ఉండకూడదు.బ్రహ్మోత్సవం మే 13న వస్తే, అ.ఆ ని మే 20కి షిఫ్ట్ చేసుకుంటాడు త్రివిక్రమ్.ఒకవేళ మే 20 కి బ్రహ్మోత్సవం విడుదల చేసుకుంటే, మే 13నే అ.ఆ ని తీసుకొచ్చేస్తాడు త్రివిక్రమ్.ఇదే విషయాన్నీ మొన్న బ్రహ్మోత్సవం సెట్లో చర్చించుకున్నారు మహేష్ బాబు - త్రివిక్రమ్.

అందుకే అ.ఆ కి సంబంధించి విడుదల తేదిపై ఎలాంటి క్లూ ఇవ్వలేదు ఇంతవరకు.బ్రహ్మోత్సవం యూనిట్ క్లారిటి ఇస్తే తప్ప, త్రివిక్రమ్ అ.ఆ విడుదల తేదిని ప్రకటించకపోవచ్చు.ఈ రకంగా బ్రహ్మోత్సవం యూనిట్ నుంచి ఒక ప్రకటన కోసం కేవలం మహేష్ అభిమానులే కాదు, అ.ఆ యూనిట్ మొత్తం ఎదురుచూస్తోంది.

Advertisement
ఇంతకీ ఆ ముంబై భామలు తెలుగు సినిమాలు చేస్తారా?

తాజా వార్తలు