మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు ఇటీవలే కలిసి పోయారు.గత కొంత కాలంగా ఎడమొహం పెడ మొహంగా ఉన్న ఇద్దరు అన్నదమ్ములు ఇటీవల కలిసి పోయి మెగా ఫ్యాన్స్‌కు కను విందు చేస్తున్నారు.
ఇటీవల జరిగిన సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్న విషయం తెల్సిందే.ఆ వేడుకలో మెగా బ్రదర్ నాగబాబు కనిపించక పోవడం మెగా ఫ్యాన్స్‌కు కొంత ఆశ్చర్యంను కలిగించింది.
అయితే నాగబాబు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సర్దార్ ఆడియోకు రాలేదు అంటూ వార్తలు వచ్చాయి.తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ వివాహ వేడుకలో సైతం నాగబాబు కనిపించడం లేదు.
చిరంజీవి కుటుంబ వేడుకలో నాగబాబు ప్రత్యేకంగా ఎప్పుడు ఉంటూ ఉంటాడు.కాని ఈసారి మాత్రం ఇప్పటి వరకు శ్రీజ వివాహ పనుల్లో నాగబాబు తల దూర్చినట్లుగా లేడు.
చిరంజీవితో గత కొన్ని నెలుగా నాగబాబు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది.పెళ్లి రోజు మాత్రమే నాగబాబు వేడుకలో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది.
అదే విధంగా నాగబాబు పిల్లలు వరుణ్ తేజ్ మరియు నిహారికలు కూడా పెళ్లి రోజే బెంగళూరు వెళ్లనున్నట్లుగా మెగా సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.