బాలయ్యకు మంత్రి పదవి??

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న విషయం తెల్సిందే.ఎమ్మెల్యేగా బాలకృష్ణ గెలిచిన వెంటనే బావగారి ప్రభుత్వంలో మంత్రి పదవి రావడం ఖాయం అంటూ అంతా అనుకున్నారు.

 Balakrishna To Get Cabinet Minister Post-TeluguStop.com

అయితే షాకింగ్‌గా బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వకుండా చంద్రబాబు తప్పించుకున్నాడు.తాజాగా ఎమ్మెల్యేగా బాలయ్య చాలా మంచి మంచి పనులు చేసి, నియోజక వర్గం ప్రజల ఆధర అభిమానాలను చూరగొన్నాడు.

దాంతో బాలయ్య అభిమానులు తమ అభిమాన హీరోకు మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నారు.

గత కొన్ని రోజులుగా ఈ డిమాండ్‌ వస్తున్న నేపథ్యంలో తాజాగా బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్‌ అయినట్లుగా తెలుస్తోంది.

ఉగాది తర్వాత ఏపీ మంత్రి వర్గంను మార్చనున్నాడు బాబు.ఆ మంత్రి వర్గ విస్తరణలో బాలయ్యకు అవకాశం ఇచ్చే ఛాన్స్‌ ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం ఉన్న ముగ్గురు మంత్రుల పనితీరు చంద్రబాబుకు మరియు లోకేష్‌కు రుచించడం లేదు.అందుకే ఆ స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నారు.

దాంతో బాలయ్యకు ఛాన్స్‌ దక్కనుంది.బాలయ్యకు మంత్రి పదవి దక్కితే ఇక రాష్ట్రాన్ని విజయపథంలో తీసుకెళ్తాడేమో చూడాలి.

ఆయన అభిమానులు అదే భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube