మహేష్‌ మూవీకి బిగ్‌ హీరోస్‌ వాయిస్‌

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు తన తర్వాత చిత్రాన్ని మురుగదాస్‌ దర్శకత్వంలో చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెల్సిందే.

వచ్చే సంవత్సరవం ఏప్రిల్‌ లేదా మే నెలల్లో వీరి కాంబినేషన్‌లో మూవీ సెట్స్‌ పైకి వెళ్లబోతుంది.

మూడు భాషల్లో మురుగదాస్‌కు మంచి క్రేజ్‌ ఉంది.దాంతో మహేష్‌బాబు నటించబోతున్న ఈ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించి తమిళం మరియు హిందీలో కూడా డబ్బింగ్‌ చేయబోతున్నారు.

భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ఠాగూర్‌ మధు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయ్యిందని, త్వరలోనే నటీ నటుల ఎంపిక చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

తెలుగుతో పాటు తమిళం మరియు హిందీలో కూడా ఈ చిత్రానికి భారీగా పబ్లిసిటీ తెచ్చేందుకు దర్శకుడు మురుగదాస్‌ ఒక వినూత్న ప్రయోగం చేయబోతున్నాడు.తమిళంలో మహేష్‌బాబు పాత్రకు సూర్యతో హిందీలో అక్షయ్‌ కుమార్‌ లేదా అమీర్‌ ఖాన్‌లతో డబ్బింగ్‌ చెప్పించాలని మురుగదాస్‌ భావిస్తున్నాడు.

Advertisement

సూర్య మరియు అక్షయ్‌ కుమార్‌లతో మురుగదాస్‌కు మంచి సన్నిహిత సంబంధాలున్నాయి.దాంతో వారు మురుగదాస్‌ విన్నపంను కాదనే అవకాశం లేదని సినీ వర్గాల వారు అంటున్నారు.

మొత్తానికి ఈసారి మహేష్‌బాబు హిందీ మరియు తమిళంలో విజయ ఢంకా మ్రోగించడం ఖాయం అని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు