రానా మంచి నిర్ణయం

టాలీవుడ్‌ హీరో రానా భోజన ప్రియుడు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆయన గతంలో ఈ విషయాన్ని పలు సార్లు చెప్పుకొచ్చాడు.

ఇదే విషయం ఆయన సన్నిహితులు కూడా చెప్పారు.నాన్‌ వెజ్‌ ఐటెంలను ఎక్కువగా ఇష్ట పడే రానా ప్రతి రోజు కూడా నాన్‌ వెజ్‌తో కూడిన భోజనం చేస్తూ ఉంటాడు.

అయితే ఇదంత గతం, తాజాగా ఈయన పూర్తి వెజిటేరియన్‌గా మారిపోయినట్లుగా చెప్పుకొచ్చాడు.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించాడు.

పూర్తి శాఖహారిగా మారిపోయినందుకు సంతోషంగా ఉందని, అందుకు పెటా వారు తనను అభినందించినట్లుగా కూడా రానా చెప్పుకొచ్చాడు.జీవ హింసకు వ్యతిరేకంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

Advertisement

ఇకపై తాను ఏ పార్టీలో, ఏ కార్యక్రమంలో పాల్గొన్నా కూడా వెజిటేరియన్‌ మాత్రమే తింటాను అని, అవి లేని పక్షంలో పస్తు ఉండేందుకు అయినా రెడీ అంటూ రానా సన్నిహితులతో చెబుతున్నాడు.రానాలో ఉన్నట్లుండి ఎందుకు ఇంత మార్పు అనే విషయం గురించి ప్రస్తుతం ఆయన సన్నిహితులు మరియు సినీ వర్గాల వారు అనుకుంటున్నారు.

సెట్లో బాలకృష్ణ, నాగార్జున ఎవరితో ఎలా ఉంటారో చెప్పేసిన నాగ మహేష్?
Advertisement

తాజా వార్తలు