‘టెంపర్‌’ టెన్షన్‌ పెడుతోంది

ఎన్టీఆర్‌, కాజల్‌ జంటగా పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘టెంపర్‌’.

బ్లాక్‌ బస్టర్‌ నిర్మాత బండ్ల గణేష్‌ నిర్మించిన ఈ భారీ సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

ఈ సినిమాకు ముందు ఎన్టీఆర్‌ వరుసగా ఫ్లాప్‌లే ఇచ్చాడు.భారీ అంచనాల నడుమ వచ్చిన ‘రామయ్యా వస్తావయ్యా’ మరియు ‘బాద్‌షా’ సినిమాలు తీవ్ర నిరాశనే మిగిల్చాయి.

తర్వాత ‘రభస’ కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.దాంతో ఎన్టీఆర్‌ ‘టెంపర్‌’ సినిమా ఎలా ఉంటుందో అనే టెన్షన్‌లో నందమూరి ఫ్యాన్స్‌ ఉన్నట్లుగా కనిపిస్తోంది.

గతంలో ఎన్టీఆర్‌, పూరిల కాంబినేషన్‌లో ‘ఆంధ్రావాలా’ సినిమా వచ్చిన విషయం తెల్సిందే.ఆ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌గా మిగిలి, ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే ఒక మచ్చగా నిలిచి పోయింది.

Advertisement

దాంతో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వచ్చేందుకు చాలా కాలం సమయం పట్టింది.ఇక ఎట్టకేలకు వీరిద్దరి కాంబినేషన్‌ వర్కౌట్‌ అయ్యింది.

ఈ సినిమా మొదలు అయిన దగ్గర నుండి కూడా అంచనాలు బాగానే వచ్చాయి.ఇక ట్రైలర్‌ విడుదల మరియు ఆడియో విడుదల తర్వాత అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.

మరి అంచనాలను అందుకోగలమా అనే అనుమానాలు చిత్ర యూనిట్‌ సభ్యుల్లో ఎక్కడో ఒక మూలన ఉన్నట్లుగా తెలుస్తోంది.ఎన్టీఆర్‌ కూడా ఈ సినిమా పట్ల చాలా టెన్షన్‌తో ఉన్నాడట.

మరి ‘టెంపర్‌’ ఫలితం ఎలా ఉంటుందనేది మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది.‘టెంపర్‌’ రివ్యూ కొరకు చూస్తూనే ఉండండి తెలుగుస్టాప్‌.

సెట్లో బాలకృష్ణ, నాగార్జున ఎవరితో ఎలా ఉంటారో చెప్పేసిన నాగ మహేష్?
Advertisement

తాజా వార్తలు