సూపర్‌స్టార్‌ దిగి వచ్చాడు

సౌత్‌ ఇండియా సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ తాజా సినిమా ‘లింగ’ ఫ్లాప్‌ అవ్వడంతో ఆ సినిమాను కొనుగోలు చేసిన పంపిణీదారులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెల్సిందే.

‘లింగ’ ఫ్లాప్‌ వల్ల తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకోవాల్సిందిగా కొందరు పంపిణీదారులు రజినీకాంత్‌కు ఇప్పటికే విన్నవించుకున్నారు.

అయితే మొదట రజినీకాంత్‌ తనకు సంబంధం లేదంటూ పంపిణీదారులతో చెప్పాడు.అయితే వారు ఎట్టి పరిస్థితుల్లో తమను ఆదుకోవాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

దీక్ష కూడా చేసేందుకు సిద్దం అవుతున్నారు.ఈ నేపథ్యంలో రజినీకాంత్‌కు నటుల సంఘం మరియు నిర్మాతల సంఘం వారు మద్దతు తెలిపారు.

రజినీకాంత్‌ పంపిణీదారుల నష్టాన్ని భరించాల్సిన అవసరం లేదంటూ మద్దతును ప్రకటించారు.మరో వైపు పంపిణీదారులు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు.

Advertisement

దాంతో రజినీకాంత్‌ మెట్టు దిగి వచ్చి పంపిణీదారులు నష్టపోయిన దాంట్లో ఎంతో కొంత ఆర్థిక సాయం చేసేందుకు సిద్దం అయ్యాడు.ఈ విషయాన్ని రజినీ సన్నిహితులు మీడియాకు తెలియజేయడం జరిగింది.

అయితే ఆ పంపిణీదారులకు ఎంత సాయం అందిస్తాడు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.పంపిణీదారులు ఒక్కొక్కరు కోట్లల్లో నష్టపోయారు.

Advertisement

తాజా వార్తలు