పబ్‌ వివాదంలో స్పందించిన అంజలి

తెలుగమ్మాయి, తమిళ, తెలుగు హీరోయిన్‌ అయిన అంజలి తాజాగా ఒక పబ్‌లో తాగి డ్యాన్స్‌ చేస్తూ, తనకు అడ్డు వచ్చిన ఒక వ్యక్తిని కొట్టిందని, ఆ వివాదం పెద్దదిగా మారి, పోలీసుల వరకు వెళ్లిందంటూ మీడియాలో నిన్నంత యమ వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.అయితే తనపై వస్తున్న వార్తలను అంజలి తోసిపుచ్చింది.

 Actress Anjali Responds Over Pub Issue-TeluguStop.com

పబ్‌లో ఎలాంటి వివాధం జరిగింది లేదని, అంతా మీడియా సృష్టే అంటూ చెప్పుకొచ్చింది.

తాను పబ్‌లో ఒక కార్యక్రమానికి వెళ్లిన సమయంలో అక్కడే ఉన్న మీడియా వారు ఫొటోలకు ఫోజులు ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది.

అందుకు తాను ఒప్పుకోలేదు.దాంతో వారు ఇలాంటి అసత్య ఆరోపణలు తనపై చేస్తున్నారని అంజలి ఆవేదన వ్యక్తం చేస్తోంది.

మీడియాలో వస్తున్న వార్తలను తన అభిమానులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.అయితే ఈమె వాదనలో నిజం లేదని, పబ్‌లోతాగి గొడవ చేసి, ఇప్పుడు కవరింగ్‌ చేసుకుంటుందని మీడియా మిత్రులు అంటున్నారు.

మొత్తానికి అంజలి ఈ వివాదం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube