సీమాంధ్ర ప్రతిపక్ష పార్టీ వైకాపా తన వ్యూహాన్ని పూటిగా మార్చుకుంది అన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి….అసలైతే ఇప్పటివరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పటీకీ ఆపార్టీ జనాలకు దగ్గరవ్వాల్సింది పోయి.
దూరం అయిపోయింది.ఇదిలా ఉంటే….
అవన్నీ పక్కన పెట్టేసి.ఇప్పుడు వైకాపా సరికొత్త పద్దతిలో ఏకంగా కేంద్రం పైనే…గురి పెట్టింది…వివరాల్లోకి వెళితే…దశల వారీగా కమలదళంపై పరోక్షంగా విమర్శలు మొదలు పెట్టి వాటిని తీవ్రం చేసే దిశగా ముందుకు వెళుతోంది ఏపీ లోని ప్రతిపక్ష పార్టీ.
విధానపరమైన అంశాలను టేకప్ చేసి విమర్శలు మొదలు పెడుతోంది.ఈ విషయంలో వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి క్రియాశీలకంగా కనిపిస్తున్నాడు.
ఇప్పటికే మిధున్ ఇంతకు ముందే ఒకసారి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిపై విమర్శలు చేశాడు.ఆ సంధర్భంలో ఆయన మాట్లాడుతూ.
పేరుకు కేంద్రమంత్రి.తెలుగువాడు అయినా… రాష్ట్రానికి ఏమీ సాధించలేకపోతున్నారని వెంకయ్యపై కస్సు బుస్సు లాడాడు.
ఇదిలా ఉంటే తాజాగా కేంద్రమంత్రులను లక్ష్యంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశాడు మిథున్.ఏపీలో పేరుకు కేంద్రమంత్రులు ఉన్నా వీరివల్ల రాష్ట్రానికి ఒరుగుతున్నది ఏమీ లేదని వైకాపా ఎంపీ విమర్శించాడు.
రాష్ట్రంలో రైల్వేలకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించడం లేదని ఈ వైకాపా ఎంపీ ధ్వజమెత్తాడు.మరి ఇలాంటి విధానపరమైన విమర్శలు ఆహ్వానించదగినవే.కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని.భయపడకుండా… రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలపై నినదించే హక్కు అందరికీ ఉంటుంది.మరి ఈ వ్యూహాత్మక ఎత్తుగడ వెూక ఉన్న కారాణాలు ఏంటో అర్ధం కావడంలేదు అంటున్నారు.సాక్షాత్తూ వైకాపా నేతలు.







