జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువతి, యువకులకు నిర్దేశిత ఆన్లైన్ రుసుముతో కూడిన ద్విచక్ర వాహన లైసెన్స్ మేళా.

డిసెంబర్ 19వ తేదీ లోపు సంబంధించిన పోలీస్ స్టేషన్ల పరిదిలో పేరు నమోదు చేసుకోగలరు.జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

 Under The Auspices Of The District Police Department, Two-wheeler License Fair F-TeluguStop.com

రాజన్న సిరిసిల్ల జిల్లాలో డ్రైవింగ్ వచ్చి లైసెన్స్ లేని యువతీ యువకుల కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్దేశిత ఆన్లైన్ రుసుముతో ద్విచక్ర వాహన లైసెన్స్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…డ్రైవింగ్ చేసే వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్ తో పాటుగా ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం అని దానికోసం జిల్లా పరిధిలోని డ్రైవింగ్ వచ్చి లైసెన్స్ లేని వారి కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్దేశిత ఆన్లైన్ రుసుముతో ద్విచక్ర వాహన లైసెన్స్ మెళ నిర్వహించడం జరుగుతుందన్నారు.డ్రైవింగ్ వచ్చి లైసెన్స్ లేని ఆసక్తి గల 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఈ నెల డిసెంబర్ 19 వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు (SSC MEMO, ADHAR CARD ) తో మీ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో పేరు నమోదు చేసుకోవాలని,పెరు నమోదు చేసుకున్న వారికి డ్రైవింగ్ టెస్ట్ లు నిర్వహించి, అందులో ఆర్హత సాధించిన వారికి తదనంతరం లైసెన్స్ లు జారిచేయడం జరుగుతుందన్నారు.

నిర్దేశిత ఆన్లైన్ రుసుముతో ద్విచక్ర వాహన లైసెన్స్ మేళా

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube