డీకే అరుణను అవమానించడం లేదు..: సీఎం రేవంత్ రెడ్డి

బీజేపీ నాయకురాలు డీకే అరుణ( DK Aruna ) చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) స్పందించారు.డీకే అరుణను తాను అవమానించడం లేదని తెలిపారు.

 Im Not Insulting Dk Aruna Cm Revanth Reddy Details, Cm Revanth Reddy, Comments,-TeluguStop.com

డీకే అరుణ ప్రధాని మోదీ చేతిలో కత్తిలా మారి తమ కడుపులో పొడుస్తోందని రేవంత్ రెడ్డి విమర్శించారు.కొడంగల్ నియోజకవర్గంపై( Kodangal Constituency ) కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక ప్రేమ ఉంటుందని తెలిపారు.

ఈ క్రమంలోనే కొడంగల్ లో దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు.

గతంలో కృష్ణా జలాలతో పాటు రైల్వే లైన్ రాకుండా డీకే అరుణ అడ్డుకున్నారని ఆరోపించారు.70 ఏళ్ల పాటు పాలమూరుకు అన్యాయం జరిగిందన్నారు.మంత్రిగా ఉన్న సమయంలో డీకే అరుణ పాలమూరుకు ఏమీ చేయలేదని విమర్శించారు.

అంతేకాకుండా గతంలో మక్తల్ ఎత్తిపోతలకు కూడా డీకే అరుణ అడ్డుపడ్డారని చెప్పారు.కానీ తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఐదు గ్యారంటీలను అమలు చేశామని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube