ట్రంప్, బైడెన్ సరే.. అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన మరో నలుగురు ఎవరు..?

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల కోలాహలం తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే.రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,( Donald Trump ) డెమొక్రాటిక్ పార్టీ తరపున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌లు( President Joe Biden ) అధికారికంగా నామినేషన్ సంపాదించారు.2020 అధ్యక్ష ఎన్నికల తర్వాత మరోసారి వీరిద్దరూ తలపడుతున్నారు.విరాళాల సేకరణతో పాటు ప్రచారంలోనూ ఇద్దరు నేతలు దూసుకెళ్తున్నారు.

 Apart From Trump Biden These 4 Candidates Are In Us Presidential Race 2024 Detai-TeluguStop.com

ఇదిలావుండగా.ట్రంప్, బైడెన్‌లతో పాటు మరికొందరు అభ్యర్ధులు కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు.

మరియాన్నే విలియమ్సన్ :

Telugu Biden, Cornel, Democratic, Donald Trump, Jill Stein, Joe Biden, Republica

ప్రముఖ రచయిత్రి మరియాన్నే విలియమ్సన్ (71)( Marianne Williamson ) అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు.2020 ప్రెసిడెన్షియల్ ప్రైమరీలో డెమొక్రాట్‌ పార్టీ తరపున పోటీ చేసిన ఆమె.ఓటింగ్ జరగకముందే రేసు నుంచి తప్పుకున్నారు.

రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్ :

Telugu Biden, Cornel, Democratic, Donald Trump, Jill Stein, Joe Biden, Republica

వ్యాక్సిన్ వ్యతిరేక కార్యకర్త, పర్యావరణ న్యాయవాది అయిన రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ (70)( Robert F Kennedy ) తొలుత డెమొక్రాటిక్ పార్టీ నామినేషన్ కోసం జో బైడెన్‌తో పోటీపడి.తర్వాత స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు.పోల్స్ ప్రకారం.

బైడెన్‌‌తో పోలిస్తే కెన్నెడీ రాకతో ట్రంప్ విజయావకాశాలు తీవ్రంగా దెబ్బతింటాయట.ఆయన నిర్ణయం ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంటున్నారు.

ఎందుకంటే ఆయనకు డెమొక్రాట్లు, రిపబ్లికన్ల నుంచి పెద్ద ఎత్తున మద్ధతుదారులు వున్నారు.దీనికి తోడు ఆయన వ్యాక్సిన్‌లకు వ్యతిరేకం, స్వతహాగా న్యాయవాది.

రాయిటర్స్ సహా ఇతర ప్రముఖ సంస్థల ఓపీనియన్ పోల్స్‌లో కెన్నెడీకి 16 శాతం మద్ధతు వుందని అంచనా వేసింది.దివంగత యూఎస్ సెనేటర్ రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ కుమారుడే .కెన్నెడీ జూనియర్.1968లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సమయంలో ఆయన హత్యకు గురయ్యారు.

కార్నెల్ వెస్ట్ :

Telugu Biden, Cornel, Democratic, Donald Trump, Jill Stein, Joe Biden, Republica

రాజకీయ కార్యకర్త, తత్వవేత్త, విద్యావేత్త అయిన కార్నెల్ వెస్ట్( Cornel West ) అధ్యక్ష అభ్యర్ధిగా థర్డ్ పార్టీ బిడ్ సమర్పించారు.ప్రగతిశీల, ప్రజస్వామ్య వర్గాల ఓటర్లను ఆయన ఆకర్షించే అవకాశం వుంది.తొలుత గ్రీన్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఆయన గతేడాది అక్టోబర్‌లో స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు.పేదరికాన్ని అంతమొందిస్తానని కార్నెల్ హామీ ఇచ్చారు.

జిల్ స్టెయిన్ :

Telugu Biden, Cornel, Democratic, Donald Trump, Jill Stein, Joe Biden, Republica

2016 అధ్యక్ష ఎన్నికల్లో గ్రీన్‌పార్టీ తరపున పోటీ చేసిన జిల్ స్టెయిన్ .( Jill Stein ) డెమొక్రాటిక్ , రిపబ్లికన్‌ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.శ్రామికులు, యువత, వాతవరణం విషయంలో డెమొక్రాట్లు పదే పదే మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆమె ప్రచారాన్ని ప్రారంభించారు.అయితే రిపబ్లికన్లు కనీసం అలాంటి వాగ్థానాలు మొదటి నుంచి చేయలేదని దుయ్యబట్టారు.73 ఏళ్ల స్టెయిన్.2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం తర్వాత రీకౌంట్ కోసం మిలియన్ డాలర్లను సేకరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube