తెలంగాణ ఇంటర్మీడియట్ )( Telangana Inter results )పరీక్షా ఫలితాలు రేపు విడుదలకానున్నాయి.ఈ మేరకు ఉదయం 11 గంటలకు ఇంటర్ విద్యామండలి కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజల్ట్ ను విడుదల చేయనున్నారు.
ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి తెలిపారు.రిజల్ట్ ను విద్యార్థులు https:// results.cgg.gov.in లేదా https:// tsbie.cgg.gov.in అనే వెబ్ సైట్లలో చెక్ చేసుకునే వీలు కల్పించినట్లు వెల్లడించారు.కాగా తెలంగాణలో ఫిబ్రవరి 28 వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఇంటర్ పరీక్షలకు సుమారు 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు.
వీరిలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 4,78,527 మంది ఉండగా.ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు 4,43,993 మంది ఉన్నారు.
అదేవిధంగా వృత్తి విద్యా కోర్సులకు చెందిన విద్యార్థులు ఫస్ట్ ఇయర్ 48,227 మంది ఉండగా.సెకండ్ ఇయర్ లో 46,542 మంది విద్యార్థులు ఉన్నారు.
మరోవైపు ఈ నెల 30వ తేదీన తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడి కానున్నాయి.