సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా ప్రతి ఒక్కరి లక్ష్యం ఒకటే సక్సెస్ కొట్టడం అయితే దీని కోసమే ప్రతి హీరో వైవిధ్యమైన కథ కథనాలను ఎంచుకుంటూ ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.ఇక ఈ క్రమంలో ఒక హీరో తనని తాను సూపర్ స్టార్ గా మలుచుకోవడానికి చాలా సక్సెస్ లను అందుకోవాల్సి వచ్చింది.
ఆయన ఎవరు అంటే మహేష్ బాబు( Mahesh Babu ).అయితే మహేష్ బాబు ఎప్పుడు తెలుగు సినిమా డైరెక్టర్ల తోనే సినిమాలు చేస్తు సక్సెస్ కొడుతూ ఉంటాడు.ఇక ఆయన తమిళ్ డైరెక్టర్లను నమ్మి సినిమాలు చేశాడు.ఆ రెండు సినిమాలు కూడా ఇప్పుడు ప్లాప్ అయ్యాయి.అందులో ఎస్ జె సూర్య( SJ Surya ) డైరెక్షన్ మహేష్ హీరోగా చేసిన ‘నాని ‘ సినిమా డిజాస్టర్ అయింది.
ఇక అలాగే మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన స్పైడర్ సినిమా కూడా ఫ్లాప్ గా మిగిలింది.ఇక మొత్తానికైతే ఆయన తన ఎంటైర్ కెరియర్ లో ఇద్దరు తమిళ్ దర్శకులను నమ్మి మోసపోయాడననే చెప్పాలి.అయితే ఇప్పుడు మహేష్ బాబు అందుకోలేని ఫీట్ ను రామ్ చరణ్ అందుకోవాలనే ఉద్దేశ్యం లో తను ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక తమిళ్ దర్శకుడు శంకర్( Director Shankar ) డైరెక్షన్ లో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమాతో ( game changer movie ) సూపర్ సక్సెస్ ని కొట్టి మహేష్ బాబుకి సాధ్యం కానీ రికార్డ్ ను తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని తొందర్లో నే రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమాతో తనను తాను స్టార్ హీరో గా మరోసారి ఎలివేట చేసుకోవాలని చూస్తున్నాడు… పాన్ ఇండియాలో ఇప్పటికే రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమాతో మ్యాజిక్ ని సూపర్ హిట్ చేశాడు.ఇక అదే మ్యాజిక్ ని మరోసారి రిపీట్ చేయాలని చూస్తున్నాడు…
.