ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాలలో( Tenth Class Results ) భారీ సంఖ్యలో విద్యార్థులు మంచి మార్కులు సాధించి సత్తా చాటారు.ఉమ్మడి కర్నూలు జిల్లా( Kurnool District ) రుద్రవరం మండలం బీరవోలు ప్రాంతానికి చెందిన హర్షిత( Harshitha ) పదో తరగతి పరీక్షలలో 594 మార్కులు సాధించారు.
హర్షిత తండ్రి రైతు కాగా ఈమెకు మంచి మార్కులు రావడంతో గ్రామస్తుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
హర్షిత మండలంలోనే అత్యధిక మార్కులు సాధించి ప్రశంసలు అందుకుంటున్నారు.
నంద్యాలలోని ప్రముఖ పాఠశాలలో చదివిన హర్షిత స్కూల్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం గమనార్హం.తమ కుమార్తెకు మంచి ర్యాంక్ రావడం సంతోషాన్ని కలిగించిందని హర్షిత తల్లీదండ్రులు పుల్లారెడ్డి,( Pullareddy ) శిరీష( Sirisha ) వెల్లడించారు.
హర్షిత ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు ఈ విద్యార్థినికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
హర్షితకు మంచి మార్కులు వచ్చిన నేపథ్యంలో ఆమె ఉన్నత చదువులకు ప్రభుత్వం నుంచి కూడా కొంతమేర సహాయం అందితే కెరీర్ పరంగా హర్షిత మరింత ఎదిగే అవకాశాలు అయితే ఉంటాయి.రైతుబిడ్డ హర్షితను చదువు విషయంలో ప్రోత్సహించిన కుటుంబ సభ్యులను సైతం నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.హర్షిత తన టాలెంట్ తో ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగారు.
పదో తరగతి పరీక్షలలో 550కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు బెనిఫిట్ కలిగేలా ప్రభుత్వం ఏవైనా పథకాలను అమలు చేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ఏపీ ప్రభుత్వం( AP Govt ) ఈ దిశగా అడుగులు వేస్తుందో లేదో చూడాల్సి ఉంది.మరికొన్ని గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు రిలీజ్ కానుండగా పాస్ పర్సెంటేజ్ ఎంత ఉంటుందో చూడాల్సి ఉంది.తల్లీదండ్రులు ప్రోత్సహిస్తే విద్యార్థులు పరీక్షల ఫలితాలలో అద్భుతాలు చేస్తారని చాలామంది విద్యార్థులు ప్రూవ్ చేస్తున్నారు.