తెలంగాణలో పలుచోట్ల భూకంపం..!!

ప్రపంచవ్యాప్తంగా రకరకాల పరిస్థితులు దాపరిస్తున్నాయి.ఈ ఏడాది ప్రారంభంలోనే జపాన్ లో భూకంపం( Earthquake ) మరియు సునామీ రావటం జరిగింది.

 Earthquake In Many Places In Telangana Details, Earthquake, Sangareddy, Telangan-TeluguStop.com

దీంతో పలు భవనాలు దెబ్బ తినడంతో పాటు కొంతమంది గాయాల పాలు కూడా కావడం జరిగింది.ఏకంగా రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో వచ్చింది.ఆ తర్వాత నేపాల్ లో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.ఏడాది ప్రారంభంలోనే పలు చోట్ల భారీ ఎత్తున భూకంపాలు కలిగాయి.

ప్రపంచంలో ఏదో ఒకచోట ప్రతిరోజు భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి.భారతదేశంలో కూడా ఢిల్లీ ఇంకా జమ్మూ కాశ్మీర్ వంటి చోట్ల గత ఏడాది భారీ ఎత్తున భూకంపాలు వచ్చాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు తెలంగాణలో( Telangana ) కూడా పలుచోట్ల భూకంపం రావటం జరిగింది.శనివారం సంగారెడ్డి జిల్లా( Sangareddy District ) న్యాల్కల్ మండలంలో భూకంపం సంభవించింది.న్యాల్కల్, ముంగి గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.భూకంప సమయంలో వింత శబ్దాలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు.

భూప్రకంపనలపై అధికారులు గ్రామాల్లో ఆరా తీస్తున్నారు.భూ ప్రకంపనలు దాటికి ఇళ్లల్లో నుంచి ప్రజలు బయటికి వచ్చి భయాందోళనకు గురికావడం జరిగింది.

తెలంగాణలో భూకంపాలు రావటం అరుదు.పైగా సంగారెడ్డి వంటి చోట్ల భూప్రకంపనలు రావటంతో ప్రజలంతా ఆందోళనకు గురవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube