తెలంగాణలో పలుచోట్ల భూకంపం..!!
TeluguStop.com
ప్రపంచవ్యాప్తంగా రకరకాల పరిస్థితులు దాపరిస్తున్నాయి.ఈ ఏడాది ప్రారంభంలోనే జపాన్ లో భూకంపం( Earthquake ) మరియు సునామీ రావటం జరిగింది.
దీంతో పలు భవనాలు దెబ్బ తినడంతో పాటు కొంతమంది గాయాల పాలు కూడా కావడం జరిగింది.
ఏకంగా రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో వచ్చింది.
ఆ తర్వాత నేపాల్ లో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.
ఏడాది ప్రారంభంలోనే పలు చోట్ల భారీ ఎత్తున భూకంపాలు కలిగాయి.ప్రపంచంలో ఏదో ఒకచోట ప్రతిరోజు భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి.
భారతదేశంలో కూడా ఢిల్లీ ఇంకా జమ్మూ కాశ్మీర్ వంటి చోట్ల గత ఏడాది భారీ ఎత్తున భూకంపాలు వచ్చాయి.
"""/" /
ఇదిలా ఉంటే ఇప్పుడు తెలంగాణలో( Telangana ) కూడా పలుచోట్ల భూకంపం రావటం జరిగింది.
శనివారం సంగారెడ్డి జిల్లా( Sangareddy District ) న్యాల్కల్ మండలంలో భూకంపం సంభవించింది.
న్యాల్కల్, ముంగి గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
భూకంప సమయంలో వింత శబ్దాలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు.భూప్రకంపనలపై అధికారులు గ్రామాల్లో ఆరా తీస్తున్నారు.
భూ ప్రకంపనలు దాటికి ఇళ్లల్లో నుంచి ప్రజలు బయటికి వచ్చి భయాందోళనకు గురికావడం జరిగింది.
తెలంగాణలో భూకంపాలు రావటం అరుదు.పైగా సంగారెడ్డి వంటి చోట్ల భూప్రకంపనలు రావటంతో ప్రజలంతా ఆందోళనకు గురవుతున్నారు.
రాజబాబు అసలు పేరేంటో మీకు తెలుసా.. హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్నారా?