ప్రముఖ ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు అయిన స్విగ్గీ, జొమాటో( Swiggy, Zomato ) దిమ్మ తిరిగే షాక్ ఇస్తున్నాయి.వీటిలో ఆర్డర్ పెట్టిన ఆహారాల్లో పురుగులు, బల్లులు వస్తున్నాయి.
ఆ ఫుడ్ పొరపాటున తిన్నవారు వాంతులు చేసుకుంటూ చాలా సఫర్ అవుతున్నారు.రీసెంట్‌గా తమ ఫుడ్ ఆర్డర్‌లలో అవాంఛిత జీవులను కనుగొన్న ఇద్దరు బెంగళూరు వాసులు తమ భయానక అనుభవాలను పంచుకున్నారు.
టెక్ ప్రొఫెషనల్ అయిన ధవల్ సింగ్, స్విగ్గీ ద్వారా లియోన్స్ గ్రిల్ నుంచి సలాడ్‌ను ఆర్డర్ చేశాడు.అయితే పాలకూరలో ఒక బతికి ఉన్న నత్త పాకడం చూసి షాక్ అయ్యాడు.
అతను ఫుడ్ లో తిరుగుతున్న నత్త వీడియోను రికార్డ్ చేశాడు.దానిని మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్ (గతంలో ట్విట్టర్), రెడ్డిట్‌లో పోస్ట్ చేశాడు, ఆ రెస్టారెంట్ నుండి ఆర్డర్ చేయవద్దని ఇతరులను హెచ్చరించాడు.
స్విగ్గీని ట్యాగ్ చేసి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరాడు.
మరో బెంగుళూరు( Bengaluru ) నివాసి హర్షిత, జొమాటో ద్వారా టాప్రి బై ది కార్నర్ నుంచి చికెన్ ఫ్రైడ్ రైస్‌ని ఆర్డర్ చేసింది.అయితే ఆమె ఆహారంలో చనిపోయిన బొద్దింకను చూసి చాలా అసహ్యం వ్యక్తం చేసింది.ఆమె ఎక్స్‌లో బొద్దింక( Cockroach ) వీడియోను కూడా షేర్ చేసింది.
జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్‌ని, వినియోగదారుల వ్యవహారాల శాఖ, డెలివరీ యాప్‌ను ట్యాగ్ చేసింది, తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేసింది.జొమాటో తన సంప్రదింపు వివరాలను, ఆర్డర్ IDని ప్రైవేట్ మెసేజ్ ద్వారా పంపమని ఆమెను కోరడం ద్వారా ప్రతిస్పందించింది.
ఈ సంఘటనలు పట్టణ వినియోగదారులలో ప్రసిద్ధి చెందిన ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవల పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలపై ఆందోళనలను లేవనెత్తాయి.చాలా మంది వ్యక్తులు సోషల్ మీడియాలో బాధితుల పట్ల తమ ఆగ్రహాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు, మరికొందరు తమ ఫుడ్ ఆర్డర్‌లలో కీటకాలు, సరీసృపాలు కనుగొన్న వారి సొంత కథనాలను కూడా పంచుకున్నారు.ఆన్‌లైన్ మీల్స్‌తో ప్రాణాలకే రిస్క్ అని, హాయిగా ఇంట్లో వంట చేసుకోవడం మంచిదని ఇంకొందరు సూచించారు.