ప్రభాస్ ఆ రెండు సినిమాల్లో అవి లోటే.. డార్లింగ్ ఫ్యాన్స్ లో నిరాశ!

ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాలో అయినా మ్యూజిక్ అనేది సినిమాకు కీలకంగా మారింది.ముందుగా మ్యూజిక్ పరంగా హిట్ అయితే ఆ సినిమా సగం హిట్ అయినట్టే.

 Bad News For Prabhas Fans Unexpected News From Kalki 2898 Ad And Salaar , Prabh-TeluguStop.com

ఈ విషయాన్నీ చాలా సినిమాలు నిరూపించాయి.పాటలు బ్లాక్ బస్టర్ అయితే సినిమాకు భారీ హైప్ పెరుగుతుంది.

అలాగే సినిమా హిట్ లో కీలక పాత్ర పోషించేది పాటలు అనే చెప్పాలి.

కానీ ఈ విషయంలో ప్రభాస్ ఫాన్స్ కు నిరాశ తప్పేలా లేదు.ఎందుకంటే పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో మ్యూజిక్ పెద్ద మైనస్ కానున్నట్టు తెలుస్తుంది.ప్రభాస్ చేస్తున్న కల్కి,( Kalki 2898 AD ) సలార్ ( Salaar movie )రెండు ప్రాజెక్టుల్లో మ్యూజిక్ అనేది మైనస్ కానుందట.

ఈ రెండు సినిమాల్లో ఒకటి లేదా రెండు సాంగ్స్ మాత్రమే ఉండే అవకాశం ఉందని అంటున్నారు.ఎందుకంటే ఈ రెండు కూడా స్టోరీ, స్క్రీన్ ప్లే బేస్ గా తెరకెక్కుతుండడంతో ఈ సినిమాల్లో పాటలకు ఛాన్స్ తక్కువుగా ఉండనుందని అంటున్నారు.

అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాల్లో పాటలను ఆశించక పోవడమే మంచిది అనే టాక్ నెట్టింట వైరల్ అయ్యింది.ఈ విషయం విన్న ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

ఇక సలార్ సినిమా( Salaar movie ) సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నారు.

అలాగే కల్కి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించిన వాయిదా పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి.మరి ఈ రెండు ప్రాజెక్టులు కాస్త పక్కన పెడితే ప్రభాస్ ( Prabhas )మారుతి దర్శకత్వంలో కూడా సినిమా చేయనున్నాడు.ఈ ప్రాజెక్ట్ మాత్రం ఫుల్ ఎంటర్టైనింగ్ గా ప్లాన్ చేస్తున్నారు.దీంతో ఈ రెండు సినిమాల్లో ఉన్న లోటును దీంతో తీర్చే అవకాశం అయితే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube