ప్రభాస్ ఆ రెండు సినిమాల్లో అవి లోటే.. డార్లింగ్ ఫ్యాన్స్ లో నిరాశ!

ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాలో అయినా మ్యూజిక్ అనేది సినిమాకు కీలకంగా మారింది.

ముందుగా మ్యూజిక్ పరంగా హిట్ అయితే ఆ సినిమా సగం హిట్ అయినట్టే.

ఈ విషయాన్నీ చాలా సినిమాలు నిరూపించాయి.పాటలు బ్లాక్ బస్టర్ అయితే సినిమాకు భారీ హైప్ పెరుగుతుంది.

అలాగే సినిమా హిట్ లో కీలక పాత్ర పోషించేది పాటలు అనే చెప్పాలి.

"""/" / కానీ ఈ విషయంలో ప్రభాస్ ఫాన్స్ కు నిరాశ తప్పేలా లేదు.

ఎందుకంటే పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో మ్యూజిక్ పెద్ద మైనస్ కానున్నట్టు తెలుస్తుంది.

ప్రభాస్ చేస్తున్న కల్కి,( Kalki 2898 AD ) సలార్ ( Salaar Movie )రెండు ప్రాజెక్టుల్లో మ్యూజిక్ అనేది మైనస్ కానుందట.

ఈ రెండు సినిమాల్లో ఒకటి లేదా రెండు సాంగ్స్ మాత్రమే ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

ఎందుకంటే ఈ రెండు కూడా స్టోరీ, స్క్రీన్ ప్లే బేస్ గా తెరకెక్కుతుండడంతో ఈ సినిమాల్లో పాటలకు ఛాన్స్ తక్కువుగా ఉండనుందని అంటున్నారు.

అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాల్లో పాటలను ఆశించక పోవడమే మంచిది అనే టాక్ నెట్టింట వైరల్ అయ్యింది.

ఈ విషయం విన్న ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.ఇక సలార్ సినిమా( Salaar Movie ) సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నారు.

"""/" / అలాగే కల్కి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించిన వాయిదా పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి.

మరి ఈ రెండు ప్రాజెక్టులు కాస్త పక్కన పెడితే ప్రభాస్ ( Prabhas )మారుతి దర్శకత్వంలో కూడా సినిమా చేయనున్నాడు.

ఈ ప్రాజెక్ట్ మాత్రం ఫుల్ ఎంటర్టైనింగ్ గా ప్లాన్ చేస్తున్నారు.దీంతో ఈ రెండు సినిమాల్లో ఉన్న లోటును దీంతో తీర్చే అవకాశం అయితే ఉంది.

పవన్ కళ్యాణ్ వల్లే పుష్ప 2 సినిమా పోస్ట్ పోన్ అయిందా..? అసలేం జరుగుతోంది…