వైరల్: తుడిచే చీపురుపై పనికిమాలిన రాతలు.. దాన్ని వాడితే ఆరోగ్యంగా ఉంటారట!

ఈ భూమ్మీద చీపురులేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు.ఇల్లుని క్లీన్ చేయడానికి దీనిని మన పూర్వీకులు కనిపెట్టారు.

 Viral: Useless Writing On A Broom.. If You Use It, You Will Be Healthy! Broomsti-TeluguStop.com

అప్పట్లో ఇది అవసరమైన ఓ వస్తువు, నేడు అది కాస్త వ్యాపార వస్తువుగా మారిపోయింది.పల్లెలనుండి పట్టణాలు ఎప్పుడైతే రూపాంతరం చెందుతున్నాయో కొన్ని వస్తువులు వ్యాపార వస్తువులుగా మారి అనేకమందికి జీవనోపాధికి కలుగజేస్తున్నాయి.

వాటిలో చీపురు ప్రధానపాత్ర పోషిస్తుంది.ఇక అసలు విషయంలోకి వెళితే తాజాగా సోషల్ మీడియా( Social media )లో ప్యాక్ చేసి ఉన్న చీపుర్లకు సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది.

ఓ సూపర్ మార్కెట్ ముందు అమ్మకానికి ఉంచిన చీపుర్ల ర్యాపర్‌పై క్యాలరీల లిస్ట్ ఉంది.ఆ చీపురును ఉపయోగిస్తే కరిగే క్యాలరీల జాబితా రాసి ఉంచింది సదరు కంపెనీ.ఆహార పదార్థాలపై ఎలా అయితే పోషకాల విలువలు రాసి ఉంటాయో.ఆ చీపురు కట్ట ర్యాపర్‌పై కూడా న్యూట్రీషన్( Nutrition ) జాబితా రాసి ఉండడం చాలా మందికి షాక్ ఇస్తోంది.

ఈ చీపురు వాడితే 150 కేలరీలు ఖర్చు అవుతాయని ఉంది.ఆ ఫొటోను ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అవుతోంది.

దాంతో సదరు పోస్ట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.“మహిళలు కోపంగా ఉన్నప్పుడు వారి భర్తలకు దీనితోనే ఆహారం వడ్డిస్తారు” అని కొందరు కామెంట్ చేస్తే, “30 నిమిషాల పాటు వినియోగిస్తే 300 కేలరీలు కరుగుతాయి” అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.మరికొందరు సదరు వ్యాపార సంస్థలకు బుద్ధి జ్ఞానం లేదంటూ తిడుతూ కెమెంట్స్ చేస్తున్నారు.ఇంకొందరు….అడవుల్లో ఫ్రీగా దొరికే చీపురుని కూడా మనోళ్లు సొమ్ము చేసుకుంటున్నారు, ఖర్మ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరెందుకాలస్యం… మీరు కూడా అక్కడ మేటర్ చదివి మీకు తోచింది మీరు కూడా కామెంట్ చేసేయండి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube