పనిచేయని మోదీ చరిష్మా ! కర్ణాటక లో బీజేపీ ఓటమికి కారణాలేంటి ?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు( Karnataka Assembly Election Results ) కేంద్ర అధికార పార్టీ బిజెపి దూకుడుకు బ్రేకులు వేశాయి.

వచ్చే ఏడాదిలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలు బిజెపికి ఇబ్బందికరంగా మారాయి.

తప్పకుండా ఇక్కడ బిజెపి జెండా ఎగరవేరుస్తామనే ధీమాతో ఉంటూ వచ్చిన బిజెపి అగ్రనేతల ఆశలపై కన్నడ ఓటర్లు నీళ్లు చల్లారు.కేంద్ర అధికార పార్టీ హోదాలో బిజెపి ఎన్ని హామీలు ఇచ్చినా, జనాలు ఆ పార్టీని నమ్మలేదు.

దీనికి కారణం గ్యాస్, పెట్రోల్ ధరలను పెంచడంతో పాటు, అనేక అంశాలు కేంద్రం తీరుపై కర్ణాటకలో వ్యతిరేకత ఉండడం వంటివన్నీ, ఆ పార్టీ ఓటమికి కారణాలు.ఎప్పుడూ లేని విధంగా ప్రధాని నరేంద్ర మోదీ( PM Narendra Modi ) అనేకసార్లు కర్ణాటకలో పర్యటించి ఎన్నికల ప్రచారాలు నిర్వహించారు.

ముందు నుంచి అనేక అభివృద్ధి పనులు పేరుతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.అలాగే వందే భారత్ రైళ్లు ప్రారంభించారు.

Advertisement

జాతీయ రహదారులను నిర్మించారు.

ఇక ఎన్నికల ప్రచారంలో రోడ్ షోలు, బహిరంగ సభల్లో ప్రధాని మోదీ ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రసంగించారు.తనను చూసి గెలిపించాలని, తన పనితీరును చూసి ఓటేయాలని ప్రసంగాలు చేశారు.అలాగే ప్రధానమంత్రి హోదాలో ఉండి కూడా, నరేంద్ర మోధీ జై భజరంగబలి( Jai Bhajarangabali ) అనే నినాదాలు చేయడం వంటివి కర్ణాటక ఓటర్లలో ఆలోచనలను రేకెత్తించాయి.

హనుమంతుడి నినాదాలు జై భజరంగబలి అంటూ.హనుమాన్ చాలీసా ను పటించినా కూడా ప్రజలు పెద్దగా ఆసక్తి చూపించలేదు.కర్ణాటకలో అభివృద్ధి, శాంతిభద్రతలు కావాలని కోరుకోవడం తోనే బిజెపికి ఓటమి ఎదురైంది.

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో 40 స్థానాల్లో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం చేయగా, 25 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.దీంతో మోదీ చరిష్మా కూడా పనిచేయలేదనే విషయం రుజువయింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఇప్పుడు అక్కడి ఓటమి గల కారణాలపై బిజెపి( BJP ) ఎన్ని విశ్లేషణలు చేసుకున్న, జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది.స్థానిక నాయకత్వానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా ఢిల్లీ నుంచి అన్ని ఆదేశాలు రావడం, వాటిని ఇక్కడ అమలు చేయడం, ఢిల్లీ పెద్దలు పెత్తనంపై కన్నడ ప్రజలు ఆగ్రహంగా ఉండడం ఇవన్నీ బిజెపి ఓటమికి కారణాలే.స్థానిక నాయకులను ప్రోత్సహించి, స్థానికంగానే పరిపాలన పరమైన నిర్ణయాలు తీసుకునే విధంగా బిజెపి హైకమాండ్( BJP High Command ) స్వతంత్రం కల్పించకపోవడం వంటివన్నీ బిజెపి ఓటమిలో భాగస్వామ్యం అయ్యాయి.

Advertisement

త్వరలో జరగబోయే తెలంగాణ ఎన్నికల్లోను కన్నడ ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపించే అవకాశం ఉండడంతో, బిజెపి మరింతగా టెన్షన్ పడుతోంది.

తాజా వార్తలు