గురు పుష్య యోగం ఏర్పడిన రోజు.. ఈ వస్తువులను కొనుగోలు చేయడం ఎంతో మంచిది..!

ఏప్రిల్ 27వ తేదీన గురు పుష్య నక్షత్ర యోగం( Guru Pushya Yogam ) ఏర్పడింది.గురువారం రోజు ఉదయం ఏడు గంటల నుంచి పుష్య నక్షత్రం( Pushya Nakshatram ) వరకు అంటే రేపు ఉదయం 5 నిమిషాల వరకు ఈ యోగం కొనసాగుతుంది.

 These Are The Things To Buy On The Day Of Guru Pushya Yogam Details, Things To-TeluguStop.com

గురువారం పుష్య నక్షత్రం కలయిక వల్ల గురు పుష్య నక్షత్ర యోగం ఏర్పడింది.దీనినే గురు పుష్య యోగం అని కూడా అంటారు.

దీని కారణంగా మతపరమైన పనులు, పూజలు చేయడం, మంత్రాలు చదవడం, ధ్యానం చేయడం జరుగుతుంది.

ఈ యోగంలో చేసిన పని పుణ్య ఫలాలు శాశ్వతంగా ఉంటాయి.

గురు పుష్య యోగంలో ఏమి కొనాలి, ఏమి కొనకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.ఎక్కువగా ధనం ఉన్నవారు గురు పుష్య యోగంలో బంగారం ( Gold ) కొనవచ్చు.

ఇంకా చెప్పాలంటే గురు పుష్య యోగంలో ఇల్లు, దుకాణం, భూమి, వాహనం మొదలైన వాటిని కొనుగోలు చేయడం కూడా శుభమే.ఇంకా చెప్పాలంటే మీకు సంపదపై కోరిక ఉంటే గురు పుష్య యోగంలో శ్రీ యంత్రా మరియు కుబేర్ యంత్రాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకొని రావాలి.

ఇలా చేయడం వల్ల మీపై లక్ష్మీదేవి మరియు కుబేరుని అనుగ్రహం కూడా ఉంటుంది.దీనివల్ల మీ సంపద పెరుగుతుంది.ఇంకా చెప్పాలంటే పప్పు, శనగపిండి, బూందీ లడ్డులు, మతపరమైన పుస్తకాలు, తెల్లపాలరాయి మొదలైన వాటిని ఈ రోజున కొనుగోలు చేయడం మంచిదని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు.గురు పుష్య యోగంలో ఈ వస్తువులను అసలు కొనుగోలు చేయకూడదు.

గురు పుష్య యోగంలో పదునైన మరియు కోణల వస్తువులను కొనుగోలు చేయకూడదు.ఇంకా చెప్పాలంటే ఈ సమయంలో ఇనుము, గాజు,ఉక్కు మొదలైన వాటితో తయారుచేసిన వస్తువులను కొనుగోలు చేయకూడదు.నలుపు, గోధుమ రంగు దుస్తులు, తోలు, ప్లాస్టిక్ వస్తువులను కూడా కొనుగోలు చేయడం అంత మంచిది కాదు.అలాగే వివాహానికి సంబంధించిన వస్తువులను కూడా కొనకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube