విమర్శకుల నోరు మూయించిన బన్నీ.. ట్రోల్స్ ఇక ఆగినట్టేనా..

రెబల్ స్టార్ కృష్ణం రాజు గత కొన్ని రోజులుగా అనారోగ్యాలతో బాధ పడుతూ నిన్న తుదిశ్వాస విడిచారు.నిన్న తెల్లవారు జామున కృష్ణం రాజు(83) చికిత్స పొందుతూ 3.25 గంటలకు ఆసుపత్రిలో కన్నుమూసారు.కేంద్ర మంత్రి మృతి పట్ల రాజకీయ నాయకుల నుండి సినీ ప్రముఖుల వరకు అందరు నివాళులు అర్పించారు.

 Allu Arjun Console Prabhas Pays Respects To Late Rebel Star Krishnam Raju Detail-TeluguStop.com

అలాగే మన టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం ఈయన పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తారు.ఇప్పటి వరకు కృష్ణ, చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్ స్టార్స్ అందరు సంతాపం ప్రకటించి ఆయన పార్థివ దేహాన్ని కూడా సందర్శించారు.

అయితే ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పై ట్రోల్స్ వచ్చాయి.

అందుకు కారణం కూడా ఉంది.

అందరు కృష్ణం రాజు కు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించినా అల్లు అర్జున్ మాత్రం ఆయనకు సైమా అవార్డు వచ్చింది అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో ఈయనపై ట్రోల్స్ వచ్చాయి.సైమా అవార్డ్స్ అందుకున్న అందరు ఎవ్వరు పోస్ట్ చేయకుండా ఈయన మరణ వార్త విని సంతాపం ప్రకటించారు.

Telugu Krishnam Raju, Allu Arjun, Allu Arjun Fans, Bunny, Prabhas, Rebal, Siima

కానీ అల్లు అర్జున్ ప్రభాస్ స్నేహితుడు అయ్యి సంతాపం ప్రకటించక పోవడంతో అందరు విమర్శలు చేసారు.కానీ అల్లు అర్జున్ బెంగుళూరు సైమా అవార్డ్స్ ముగియగానే నేరుగా కృష్ణం రాజునూ సంతాపం తెలుపడానికి వచ్చి నివాళులు అర్పించారు.సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టారు.అల్లు అర్జున్ ప్రభాస్ ముఖంలో ఆ సమయంలో కూడా నవ్వులు పూయించేలా చేసి నెటిజెన్స్ నోరు మూయించాడు.దీంతో ఈయనను విమర్శించిన వారు ఇప్పుడు మాట్లాడడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube