యూకే : కింగ్ ఛార్లెస్ బర్త్ డే హానర్స్ లిస్ట్‌లో 40 మంది భారతీయులకు చోటు ..!!!

యూకే ప్రభుత్వం విడుదల చేసిన బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III( King Charles III ) ఫస్ట్ బర్త్ డే హానర్స్ లిస్ట్‌లో 40 మంది భారత సంతతికి చెందిన వైద్యులు, బిజినెస్ లీడర్స్, కమ్యూనిటీ ఛాంపియన్‌లు వున్నారు.ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ గ్రూప్‌లో గ్లోబల్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా వున్న డాక్టర్ పర్విందర్ కౌర్ అలీని( Dr Parvinder Kaur Aley ) ‘‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్ (ఓబీఈ) ఆఫీసర్‌గా గౌరవించారు.

 40 Indian-origin Medics Professionals Placed In King Charles Iii First Birthday-TeluguStop.com

ఈమె కోవిడ్ 19 సమయంలో టీకాలు వేయడంలో విశేష కృషి చేశారు.అలాగే కింగ్స్ కాలేజ్ లండన్‌లో రోబోటిక్ సర్జరీ, యూరాలజీకల్ ఇన్నోవేషన్‌లో చైర్‌గా వున్న ప్రొఫెసర్ ప్రోకర్ దాస్‌గుప్తాకు( Professor Prokar Dasgupta ) కూడా ఓబీఈ ప్రధానం చేశారు.

వేల్స్‌లో మహిళల ఆరోగ్యం, సంక్షేమానికి సేవలందించిన డాక్టర్ అంజు కుమార్, ( Dr Anju Kumar ) లండన్‌లో లా అండ్ ఆర్డర్ సేవలకు గాను ప్రాసిక్యూటర్ వరీందర్ హేరే, యూకే గ్రీన్ బిల్డింగ్స్ కౌన్సిల్ చైర్ సునంద్ ప్రసాద్‌లకు ఓబీఈ ప్రదానం చేశారు.

వీరితో పాటు గ్రాంట్ థోర్న్‌టన్ యూకే ఎల్ఎల్‌పీలో సౌత్ ఏషియా బిజినెస్ గ్రూప్ భాగస్వామిగా వున్న అనూజ్ చందే‌కు ఓబీఈ, సోల్ కాస్మెడిక్స్ వ్యవస్థాపకురాలు హీనా సోలంకికీ మెంబర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్ (ఎంబీఈ) ప్రదానం చేశారు.

ఫిజియోథెరపిస్ట్ రోమా భోపాల్ , బావా సింగ్ ధల్లూ, జ్యోత్స్నా శ్రీకాంత్, రీతూ ఖురానా, డిస్క్ జాకీ‌లకు ఎంబీఈ గౌరవాలు దక్కాయి.ఈ మేరకు శుక్రవారం రాత్రి లండన్‌లో యూకే ప్రభుత్వం ఈ అవార్డుల జాబితాను విడుదల చేసింది.

Telugu Indian Origins, Dr Anju Kumar, Drparvinder, Charles Iii, Charlesiii, Oliv

అసాధారణ సమాజ స్పూర్తిని ప్రదర్శించిన వ్యక్తులకు ఈ ఏడాది ప్రకటించిన కింగ్స్ హానర్స్ లిస్ట్ నిదర్శనమన్నారు యూకే ఉప ప్రధాని ఒలివర్ డౌడెన్. మొత్తం 1,171 మంది వ్యక్తులు ఈ గౌరవాన్ని పొందగా, వీరిలో 52 శాతం మంది వారి కమ్యూనిటీల్లో అత్యుత్తమ పనులు చేసినవారు.వీరిలో 11 శాతం మంది మైనారిటీ జాతుల నేపథ్యానికి చెందినవారు.

Telugu Indian Origins, Dr Anju Kumar, Drparvinder, Charles Iii, Charlesiii, Oliv

సాహిత్య రంగానికి చేసిన సేవలకు గాను ఇటీవల మరణించిన నవలా రచయిత మార్టిన్ అమిస్‌కు నైట్‌హుడ్ పురస్కారాన్ని ప్రకటించారు.అలాగే నిర్మాత స్టీఫెన్ ఫ్రెయర్స్ కూడా నైట్‌ని పొందారు.ఫ్యాషన్ మ్యాగజైన్ ‘‘వోగ్’’ ఎడిటర్ డేమ్ అన్నా వింటౌర్, రచయిత సర్ ఇయాన్ మెక్‌వాన్‌లు ‘‘ ఎలైట్ కంపానియన్స్ ఆఫ్ హానర్స్‌’’ లో స్థానం సంపాదించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube