ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) స్టార్ హీరోలు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.కానీ కొంతమంది యంగ్ హీరోలు మాత్రం ఎన్ని సినిమాలు చేసిన సక్సెసు లైతే రావడం లేదు.
ఇక అందులో కొంతమంది సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు.ఇక దర్శకుల విషయానికి వస్తే యంగ్ డైరెక్టర్స్ ఒకటి రెండు సినిమాలతో మెప్పిస్తున్నప్పటికి ఆ తర్వాత మొత్తం వాళ్లు వాళ్ల స్థాయిని మించి సక్సెస్ సాధించలేకపోతున్నారు.
ముఖ్యంగా సుధీర్ వర్మ( Sudhir Verma ) లాంటి దర్శకుడు మొదట్లో చేసిన ‘స్వామి రారా’ ( Swami Rara )లాంటి సినిమా మంచి విజయాన్ని సాధించింది.ఇక ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు పెద్ద సక్సెస్ లను సాధించలేకపోతున్నాయి.

ఇక రవితేజతో ‘రావణాసురుడు ‘ ( Ravanasura )లాంటి సినిమా కూడా చేశాడు.అయినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయింది.ఇక రీసెంట్ గా నిఖిల్( Nikhil ) హీరోగా ‘ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ‘ అనే సినిమాని చేశాడు.ఆ సినిమా కూడా సక్సెస్ ని అయితే సాధించలేదు.
అయితే ఈ సినిమాకి అంత పెద్ద పబ్లిసిటీని కూడా చేయకపోవడం విశేషం…ఇక ముందు నుంచి కూడా ఈ సినిమాలో మ్యాటర్ ఏమీ లేదని ఉద్దేశంతోనే సినిమాని హైట్ చేసుకుంటూ వస్తున్నట్లుగా తెలుస్తుంది.

మరి దానికి అనుగుణంగానే ఏ సినిమా కనీసం రిలీజ్ అయిన విషయం కూడా ఎవరికీ తెలియదు మరి సుధీర్ వర్మ అంటూ ఒక మంచి డైరెక్టర్ ఎందుకు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ సినిమాని చేయలేకపోతున్నాడు.దానికి కారణం ఏంటి అనే దూరంలో కూడా ఆలోచించాల్సిన అవసరమైతే ఉంది మరి ఆయన కనక ఎప్పుడు ఒక మంచి స్క్రీన్ ప్లే రాసుకొని డిఫరెంట్ సినిమాని చేయగలిగే మాత్రం మంచి సక్సెస్ సాధిస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
.